ప్రస్తుతం క్రికెట్ క్రీడాలోకంలో అత్యుత్తమ బ్యాట్స్ మెన్ ఎవరు అంటే? అందులో ముందువరసలో ఉండే రెండు పేర్లు.. విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్. ప్రస్తుతం వీరిద్దరి గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే వారిద్దరి ఆటలో చాలా వరకు దగ్గరి పోలికలు ఉండటమే. అయితే గత కొంత కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న కోహ్లీ తాజా ఆసియా కప్ తో ఫామ్ లోకి వచ్చాడు. వరసగా రెండు అర్దశతకాలతో, ఓ శతకంతో దుమ్మురేపాడు. అటు పాక్ కెప్టెన్ అజామ్ ఆసియా కప్ లో విఫలం అయ్యాడు. వీరిద్దరి గురించి, ఇంకా అతడి ఇష్టా.. ఇష్టాల గురించి పాక్ క్రికెట్ టీమ్ కోచ్ సక్లియిన్ ముస్తాక్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇద్దరిలో ఎవరు ఇష్టం అని ప్రశ్నించగా ఆశ్చర్యకరమైన సమాధానం చెప్పాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
కింగ్ కోహ్లీ.. సమకాలీన క్రికెట్ ప్రపంచంలో అతడితో పోటీ పడే ఆటగాడే లేడు.. అనడంలో అతిశయోక్తిలేదు. భారత్ ఆసియా కప్ లో ఇంటిదారి పట్టినప్పటికీ కోహ్లీ ఫామ్ లోకి రావడం టీమిండియాకు కొండంత బలం. ఎందుకంటే మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ ఫామ్ భారత్ కు సానుకూలాంశం. అయితే క్రీడా ప్రపంచంలో ఇద్దరి ఆటగాళ్ల మధ్య పోలికలు ఉండటం చాలా సహజమే. ఈ క్రమంలోనే పాక్ కెప్టెన్ బాబర్ అజామ్.. కోహ్లీ మధ్య చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి అని కొందరి మాజీల అభిప్రాయం. అయితే తాజాగా వీరిద్దరిలో మీకు ఎవరంటే ఇష్టం అని పాక్ క్రికెట్ టీమ్ కోచ్ సక్లియిన్ ముస్తాక్ ని అడిగితే..”నేను కచ్చితంగా బాబర్ నే ఎన్నుకుంటా.. కానీ వ్యక్తిగతంగా నా మనసుకు దగ్గరైన వ్యక్తి మాత్రం విరాట్ కోహ్లీనే” అని సమాధానం ఇచ్చాడు.
గత 3ఏళ్లుగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డ కోహ్లీ ఆసియా కప్ తో తిరిగి ఫామ్ ను అందుకున్నాడు. ఫామ్ లేమితో ఇబ్బంది పడ్డప్పుడు కోహ్లీపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ఇక ఈ కాలంలో పాక్ కెప్టెన్ మంచి ఫామ్ లో ఉండి తన దూకుడును కొనసాగించాడు. ఈ క్రమంలోనే ర్యాంకింగ్స్ లల్లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అలాంటిది వారి జట్టు కెప్టెన్ నే కాదని తనకు కోహ్లీ అంటేనే ఇష్టం అని పాక్ కోచ్ సక్లియిన్ ముస్తాక్ తెలపడం ఒక్కింత ఆశ్చర్యానికి గురిచేసిందనే చెప్పాలి. దింతో కొందరు నెటిజన్స్ స్పందిస్తూ.. “సొంత జట్టు ఆటగాడిని కాదని కోహ్లీని ప్రశంసించడం గొప్ప విషయమే. ఇక కోచ్.. బాబర్ అజామ్ గాలి తీసేశాడని” రాసుకొచ్చారు.
ఇక శ్రీలంక దిగ్గజ బ్యాటర్ జయసూర్య ను కూడా ఇదే ప్రశ్న అడిగితే.. “నాకూ.. నా కొడుక్కి కింగ్ కోహ్లీ ఆట అంటే ఎంతో ఇష్టం” అని తెలిపాడు. ఇక విరాట్ ఆడిన మ్యాచ్ ల్లో సగం మాత్రమే ఆడిన బాబర్ అద్బుతమైన ఆటతో ప్రపంచ అగ్రశ్రేణి ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అయితే ఇద్దరి మధ్య ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే? ఇంటర్నేషనల్ టీ20ల్లో ఇద్దరి వ్యక్తిగత స్కోర్లు122 రన్స్ కావడం విశేషం. ఇటీవల కోహ్లీ 71వ సెంచరీ చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా అతడిపై ప్రశంసల వర్షం కురవడం మనకు తెలిసిందే. ముస్తాక్ ను సచిన్, లారాలలో ఎవరంటే ఇష్టం అంటే సచిన్ అని తెలిపాడు. ఇంగ్లాండ్ టీమ్ అంటే తనకు ఇష్టమని అన్నాడు. ఈనేపథ్యంలో టీమిండియా రన్ మిషన్ పై పాక్ జట్టు కోచ్ ప్రశంసలు కురింపించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.