సాధారణ ఆటగాడిగా కెరీర్ ఆరంభించిన విరాట్ కోహ్లీ అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం అగ్రశ్రేణి క్రికెటర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నో రికార్డులు తన పేరున లిఖించుకున్నాడు. వన్డే, టెస్ట్, టీ20.. ఇలా అన్ని ఫార్మాట్‌లలో నంబర్ వన్ బ్యాటర్ గా తన మార్కు చూపించాడు. దీంతో పలు వ్యాపార సంస్థలు కోహ్లీని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నాయి. అంతేకాదు కోహ్లీకి సోషల్ మీడియాలోనూ చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఫాలోవర్స్ కారణంగా ఇన్‌స్టాగ్రామ్ లో కోహ్లీ పెట్టే ఒక్కో పోస్టులకు రూ. 9 కోట్లు అందుతోంది. దీంతో నెటిజన్స్ షోషల్ మీడియా ద్వారా అతడికొచ్చే ఇన్ కమ్ ను.. వరల్డ్ కప్ ప్రైజ్ మనీతో పోలుస్తూ నానా రచ్చ చేస్తున్నారు.
ప్రస్తుతం కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్.. 216 మిలియన్లు. అప్పుడప్పుడు కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సంస్థల ఉత్పత్తులకు సంబంధించి ఇన్‌స్టాలో పోస్టులు చేస్తుంటాడు. దీనికి భారీ మొత్తంలో వసూలు చేస్తాడు. ఒక్క ఇన్‌స్టా పోస్ట్‌కు 9 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్ ఫైనలిస్టులకు దక్కే ప్రైజ్ మనీని ఐసీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో విజయం సాధించిన జట్టుకు దాదాపు రూ. 13 కోట్ల (1.6 మిలియన్ డాలర్లు) పారితోషికం లభిస్తుంది. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు అందులో సగం అంటే రూ. 6.5 కోట్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. ఈ ప్రైజ్ మనీని కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఇన్ కంతో పోలుస్తున్న నెటిజన్స్.. “టీ20 వరల్డ్ కప్ ప్రైజ్ మనీ కంటే.. కోహ్లీ రెండు ఇన్ స్టా పోస్టులకు వచ్చే ఇన్ కం ఎక్కువంటూ..” మీమ్స్ సృష్టిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
T20 world cup 2022 prize money vs Kohli instagram income.. pic.twitter.com/Wu7Gd8CjwG
— Govardhan Reddy (@gova3555) October 8, 2022
ఈ పోస్టులపై భిన్న రకాలుగా కామెంట్స్ వెలువడుతున్నాయి. “దేశానికి పేరు తెచ్చే ప్రపంచ కప్ ను.. ఇలా ఒక ఆటగాడి ఇన్ కంతో కంపేర్ చేయడం సరికాదంటూ..” పలువురు సూచిస్తున్నారు. కాగా, అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. భారత జట్టు తన తొలి మ్యాచులో దాయాది దేశం పాకిస్తాన్ తో తలపడనుంది. అక్టోబర్ 23న మెల్‌బోర్న్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
MCG getting ready for the T20 World Cup, first will be India vs Pakistan clash. pic.twitter.com/cMeHb29M1c
— Johns. (@CricCrazyJohns) October 6, 2022