పొట్టి ప్రపంచ కప్ లో భాగంగా దాయాధి దేశాల మధ్య మెల్ బోర్న్ వేదికగా అక్టోబర్ 23న మ్యాచ్ జరగాల్సివుంది. అందుకోసం భారత జట్టు ఇప్పటికే ఆస్ట్రేలియా(పెర్త్) చేరుకోగా, పాక్ జట్టు ట్రై సిరీస్(బాంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్తాన్,)లో భాగంగా న్యూజిలాండ్ లో పర్యటిస్తోంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే.. అటు నుంచి ఆస్ట్రేలియా వెళ్లనుంది. ఈ క్రమంలో పాక్ జట్టు బలం గురుంచి చెప్పడానికి మీడియా సమావేశం నిర్వహించిన పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా.. టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీని ఉద్దేశిస్తూ అర్థం లేని వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ విషయంపై.. పాక్ మాజీ ఆటగాళ్లు మధ్యనే గొడవలు మొదలయ్యాయి. పాక్ మాజీ సారధి సల్మాన్ భట్ కోహ్లీకి మద్దతుగా నిలబడ్డాడు.
గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో పాక్ చేతిలో భారత జట్టు 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలో భారత్ పై పాక్ కు ఇదే మొట్టమొదటి విజయం. ఇక ఆసియా కప్ 2022 టోర్నీలో పాక్ పై భారత జట్టు లీగ్ మ్యాచులో గెలిచినా.. తప్పక గెలవాల్సిన పోరులో ఓటమి పాలయ్యింది. ఈ రెండు విజయాలను ఎత్తిచూపిన పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజా, భారత జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించినా.. కోహ్లీ సెంచరీతో భారత అభిమానులు అవన్నీ మర్చిపోయారంటూ చులకన చేసి మాట్లాడాడు. “ఆసియా కప్ నుంచి టీమిండియా గ్రూప్ దశలోనే నిష్క్రమించినప్పటికీ.. డెడ్ రబ్బర్ మ్యాచులో (ఆఫ్ఘనిస్తాన్ పై) కోహ్లీ సెంచరీ చేయడాన్ని భారత దేశం పొగిడింది”.
Ramiz Raza tried to troll Virat Kohli but got brutally trolled by Pakistani Anchor#ramizraja #ViratKohli𓃵 @imVkohli #QudratKaNizaam
Credits: Samaa Tv pic.twitter.com/KnlORsFoFL— Cricket Fan (@sangwancricket) October 5, 2022
“ఈ ఒక్క సెంచరీతో.. ఆసియా కప్‌లో టీమిండియా ఓటమిని కూడా అక్కడ మీడియా, అభిమానులు మర్చిపోయారు. కానీ, ఇక్కడ మాత్రం బాబర్ ఎన్ని సెంచరీలు చేసినా విమర్శలు చేస్తూనే ఉంటారు” అని రమీజ్ రాజా లాజిక్ లేని కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలను పాక్ మాజీ ఆటగాళ్లు తప్పుబడుతున్నారు. తాజాగా పాక్ మాజీ సారధి సల్మాన్ బట్ కూడా రమీజ్ రజా వ్యాఖ్యలను తప్పుబట్టాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన భట్.. “రమీజ్ రాజా వ్యాఖ్యలు అర్థం లేనివి, అనవసరంగా కోహ్లీపై ఇలాంటి కామెంట్స్ ఎందుకు? తనేమీ సాధారణ ఆటగాడు కాదు కదా.. ప్రపంచ క్రికెట్‌లో 70పైగా సెంచరీలు చేసిన రెండో ఆటగాడు” అని చెప్పుకొచ్చాడు. ఇలా అర్థంలేని మాటలు మాట్లాడడం.. పసలేని కూతలేనని విమర్శించాడు”.
Salman Butt to Ramiz Raza#Pakistan #ViratKohli pic.twitter.com/HBM77re1nA
— Abhishek Kumar (@iamabhishekk005) October 8, 2022