వరల్డ్ క్లాస్ ప్లేయర్.. రన్ మెషిన్.. రికార్డుల రారాజు ఈ పేర్లు కూడా చిన్నబోతాయి అతడి ఆట ముందు. అంతలా అతడి పరుగుల వేట సాగుతోంది మరి. ఇక క్రికెట్ చరిత్రలో మరే ఇతర ఆటగాళ్లకు సాధ్యం కాని రికార్డును సాధించాడు.. అతడే టీమిండియా డాషింగ్ అండ్ డేరింగ్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. తాజాగా ఐసీసీ 2022 టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీ. దాంతో క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడికి సాధ్యం కాని ఓ అత్యంత అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఈ అరుదైన ఘనతకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
అమోఘం.. అద్వితీయం.. అసాధారణం విరాట్ కోహ్లీ ఆటతీరును పొగడడానికి ఈ పదాలు కూడా సరిపోవు. అంతలా అతడి ఆటతీరు ఉంటుంది. ఇప్పటికే ఈ పరుగుల యంత్రం విరాట్ ఎన్నోరికార్డులను కొల్లగొడుతూ.. ప్రపంచ క్రికెట్ చరిత్రపై తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. తాజాగా మరోకలికితురాయి లాంటి ఘనతను సొంతం చేసుకున్నాడు విరాట్. అదేంటంటే? ఐసీసీ ప్రకటించిన మూడు ఫార్మాట్ల క్రికెట్ జట్లలో చోటు దక్కించుకున్న ఏకైక ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. ఇప్పటికే ICC టెస్ట్ టీముల్లో 3 సార్లు(2017,18, 19), వన్డేల్లో 6 సార్లు(2012, 14, 16, 17, 18, 19), ఇక తాజాగా 2022 గాను ఐసీసీ ప్రకటించిన టీ20 జట్టులో సైతం చోటుదక్కించుకున్నాడు కింగ్ విరాట్ కోహ్లీ.
Virat Kohli is the only player to be a part of the ICC Test, T20I & ODI team of the year 🔥#ViratKohli𓃵 #Cricket pic.twitter.com/kPY0LUGQ9D
— ᴍᴜɴɴᴀ (@imVkohli_Fan18) January 24, 2023
దాంతో మూడు ఫార్మాట్లలో చోటుదక్కించుకున్న ఏకైక ప్లేయర్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు. అయితే టెస్టుల్లో, వన్డేల్లో పలు సార్లు ఐసీసీ జట్టులో ప్లేస్ సంపాదించిన కోహ్లీ.. టీ20ల్లో ప్లేస్ సంపాదించడానికి మాత్రం కాస్త టైమ్ తీసుకున్నాడనే చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రికార్డును కోహ్లీ నెలకొల్పాడు. ఇక 2022 టీ20 జట్టులో కోహ్లీతో పాటుగా టీమిండియా నుంచి మిస్టర్ 360 సూర్య కుమార్ స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాలు చోటు దక్కించుకున్నారు. మరి కోహ్లీ ఈ ఘనత సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
This is what 𝐕𝐢𝐫𝐚𝐭 𝐊𝐨𝐡𝐥𝐢 𝐚𝐭 𝐭𝐡𝐞 𝐩𝐞𝐚𝐤 𝐨𝐟 𝐡𝐢𝐬 𝐩𝐨𝐰𝐞𝐫𝐬 can do 👑🐐#OTD in 2019, Virat Kohli clean-swept all men’s ICC awards for 2018 🏆🏆🏆 pic.twitter.com/BSnGei4HYS
— CricTracker (@Cricketracker) January 22, 2023
•ICC Test team of the year.
•ICC ODI team of the year.
•ICC T20 team of the year.Virat Kohli is the only player to feature or to be part of the ICC’s years team in all three formats.!!
— CricketMAN2 (@ImTanujSingh) January 23, 2023