ఆసీస్ తో జరుగుతున్న తొలి వన్డేలో విరాట్ కోహ్లీ తనలో ఉన్న డ్యాన్సర్ ను మరోసారి అభిమానులకు చూపించాడు. ఆస్కార్ కొల్లగొట్టిన నాటునాటు పాటకు మ్యాచ్ మధ్యలోనే స్టెప్పులు వేశాడు కోహ్లీ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భారత్-ఆస్ట్రేలియాల మధ్య మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ శుక్రవారం నుంచి ప్రారంభం అయ్యింది. అందులో భాగంగానే తాజాగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి వన్డే జరిగింది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు చెలరేగడంతో.. ఆసీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. సిరాజ్, షమీ, జడేజాలు రాణించడంతో.. 188 పరుగులకే కుప్పకూలింది ఆసీస్. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ ఓ ఆసక్తికర దృశ్యానికి వేదికైంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అవార్డులను కొల్లగొట్టి, ఆస్కార్ ను కైవసం చేసుకున్న తెలుగు పాట నాటునాటు. ఈ పాట ప్రపంచాన్ని ఓ ఊపుఊపింది. దాంతో ఎక్కడ చూసినా నాటునాటు సాంగే వినపడుతోంది. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో కూడా నాటునాటు ఫీవర్ స్పష్టంగా కనిపించింది. టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మ్యాచ్ మధ్యలో నాటునాటు పాటకు గ్రౌండ్ లోనే స్టెప్పులు వేసి అదరగొట్టాడు.
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య వాంఖడే స్టేడియం వేదికగా తొలి వన్డే జరిగింది. ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించడంతో.. ఆసీస్ 188 పరుగులకే కుప్పకూలింది. ఇదంతా కాసేపు పక్కన పెడితే.. ఈ మ్యాచ్ ఓ ఆసక్తికర సంఘట చోటుచేసుకుంది. ఆ ఆసక్తికర దృశ్యం ఏంటంటే? మ్యాచ్ జరుగుతుండగానే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. నయా ఆస్కార్ సంచలనం నాటునాటు సాంగ్ కు ఎన్టీఆర్-రామ్ చరణ్ లా స్టెప్పులు వేశాడు. స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ నాటునాటు పాటకు స్టెప్పులు వేశాడు. అయితే విరాట్ కొన్నికొన్ని సార్లు గ్రౌండ్ లో అగ్రెసివ్ గా కనిపిస్తాడు.. మరికొన్ని సార్లు చాలా జోవియల్ గా కనిపించడమే కాకుండా.. తనలోని డ్యాన్సర్ ను కూడా బయటకి తీస్తుంటాడు. తాజాగా జరిగిన ఈ మ్యాచ్ లో కూడా మ్యాచ్ మధ్యలోనే నాటునాటు పాటకు స్టెప్పులేసి అభిమానులను అలరించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఇక నాటునాటు సాంగ్ కు ఆస్కార్ రావడంతో.. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటుగా ఈ పాటకు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. దాంతో కొన్ని రోజుల నుంచి ఎక్కడ చూసినా నాటునాటు సాంగ్ ఫీవరే కనిపిస్తోంది. ఇక మ్యాచ్ వివరాల్లోకి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ భారత పేసర్ల దాటికీ బెంబేలెత్తిపోయింది. దాంతో కేవలం 188 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ జట్టులో మిచెల్ మార్ష్ ఒక్కడే 81 పరుగులతో ఒంటరి పోరాటం చేయడంతో.. ఆసీస్ కు ఆ మాత్రం స్కోర్ అయినా దక్కింది. భారత బౌలర్లలో సిరాజ్, షమీ తలా మూడు వికెట్లు పడగొట్టారు. ఇక 189 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 4 ఓవర్లకు వికెట్ నష్టపోయి 16 పరుగులు చేసింది. క్రీజ్ లో గిల్(9), విరాట్ కోహ్లీ(4) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. మరి మ్యాచ్ మధ్యలో విరాట్ కోహ్లీ నాటునాటు పాటకు స్టెప్పులు వేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#ViratKohli doing #NaatuNaatu 🔥❤️ https://t.co/by2QwUKcYi pic.twitter.com/7yLCxEbPLW
— Sastry_Chilakamarthy (@sastry_chvsv) March 17, 2023