న్యూజిలాండ్‌తో ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ఎంపికైన విషయం తెలిసిందే. టీమిండియాకు ఎంపిక అవ్వడం ఏ క్రికెటర్‌కు అయినా గొప్ప విషయం. అయ్యర్ కూడా తన కల నిజమైందని అంటున్నాడు. టీమిండియా జెర్సీ ధరించి ఆడాలనేది తన కల అని.. అది నిజం కాబోతున్నందుకు చాలా ఆనందంగా ఉందని మొదటి సారి స్పందించాడు అయ్యర్. తనపై నమ్మకం ఉంచి ఎంపిక చేసిన టీమిండియా సెలెక్టర్లకు, కెప్టెన్‌కు ధన్యవాదాలు తెలిపాడు.
తన ఎదుగుదలకు తోడ్పాటు అందించిన కోచ్‌లకు, సీనియర్ క్రికెటర్ల కూడా ఈ సందర్భంగా అయ్యర్ కృతజ్ఞతలు చెప్పాడు. అలాగే రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడేందుకు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు. కాగా వెంకటేశ్ అయ్యర్ ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి ఐపీఎల్ 2021 రెండో దశలో అదరగొట్టాడు. అద్భుతమైన పవర్‌హిట్టింగ్‌తో కేకేఆర్ మంచి ప్రారంభాలను అందించాడు.
మొదటి దశలో ఫేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో వెనుకంజలో ఉన్న జట్టును ఏకంగా ఫైనల్‌కు చేర్చడంలో అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2021లో 10 మ్యాచ్‌లు ఆడిన అయ్యర్ 41.11 సగటుతో 370 పరుగులు చేశాడు. అందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే బౌలింగ్ కూడా చేసి 3 వికెట్లు కూడా తీసుకున్నాడు. ఇప్పుడు హార్థిక్ పాండ్యా స్థానంలో టీమిండియాలో ఆల్‌రౌండర్‌గా ఎంపికైన అయ్యర్ తన సత్తా చాటనున్నాడు.