ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి డే-నైట్ టెస్ట్ మ్యాచ్ లో కివీస్ బ్యాట్స్ మెన్ సెంచరీతో కదం తొక్కాడు. దాంతో ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడు సాధించని రికార్డును తనపేరున లిఖించుకున్నాడు.
రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా.. ఇంగ్లాండ్-న్యూజిలాండ్ ల మధ్య తొలి టెస్ట్ ప్రారంభం అయ్యింది. డే అండ్ నైట్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలి రోజు ఇంగ్లాండ్ బ్యాటర్లు అదర గొడితే.. రెండో రోజు కివీస్ బ్యాటర్లు సత్తా చాటారు. దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 98 పరుగుల ఆధిక్యం లభించింది ఇంగ్లాండ్ కు. ఇక ఈ మ్యాచ్ లో సెంచరీ చెయ్యడం ద్వారా ప్రపంచ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించాడు కివీస్ కీపర్ టామ్ బ్లండెల్. ఇప్పటి వరకు ఈ రికార్డు ఎవరికీ సాధ్యం కాకపోవడం విశేషం. ఈ రికార్డుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తలపడుతున్నాయి ఇంగ్లాండ్-న్యూజిలాండ్ జట్లు. ఇక తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్ మరోసారి తన బజ్ బాల్ క్రికెట్ ను ప్రపంచానికి రుచి చూపించింది. తొలి రోజే 325 పరుగులు చేసి మరో వికెట్ ఉండగానే డిక్లేర్ చేసి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇక అనంతం బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ తొలి రోజు ఆట ముగిసే రెండు వికెట్లు కోల్పోయి 37 పరుగులు చేసింది. తర్వాత రెండో రోజు ఇన్నింగ్స్ ను ఆరంభించిన కివీస్ తడబడుతూనే పరుగులు సాధించింది. టాపార్డర్, మిడిలార్డర్ పూర్తిగా విఫలం అయ్యారు. జట్టులో ఓపెనర్ కాన్వే(77) పరుగులు చెయ్యగా, ఏడో స్థానంలో బ్యాటింగ్ దిగిన వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ శతకంతో కదం తొక్కాడు. 181 బంతులు ఎదుర్కొన్న టామ్ 19 ఫోర్లు, సిక్స్ తో 138 పరుగులు చేశాడు.
దాంతో 306 పరుగులు చేయగలిగింది న్యూజిలాండ్. ఈ క్రమంలోనే సెంచరీతో మెరిసిన టామ్ బ్లండెల్ ప్రపంచ క్రికెట్ లో ఇంత వరకు ఎవరూ సాధించని రికార్డు సాధించాడు. 2015 నుంచి డే-నైట్ టెస్ట్ లు స్టార్ట్ అవ్వగా.. ఇప్పటి వరకు 20 డే-నైట్ మ్యాచ్ లు జరిగాయి. ఈ పింక్ బాల్ క్రికెట్ మ్యాచ్ లల్లో ఏ ఒక్క వికెట్ కీపర్ కూడా సెంచరీ సాధించలేదు. ఇప్పడు ఈ అరుదైన ఘనత సాధించిన ఒకే ఒక్కడిగా బ్లండెల్ నిలిచాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా గానీ మెుక్కవోని దీక్షతో బ్యాటింగ్ చేశాడు బ్లండెల్.
ఇక మ్యాచ్ వివరాల్లోకి వస్తే.. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 9 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసి డిక్లేర్ ఇచ్చింది. అనంతరం కివీస్ తన తొలి ఇన్నింగ్స్ లో 306 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇక తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ రెండు వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. దాంతో ఇంగ్లాండ్ కు 98 పరుగుల ఆధిక్యం లభించింది. క్రీజ్ లో బ్రాడ్(6), పోప్(14) పరుగులతో ఉన్నారు. ప్రస్తుతానికి రెండు రోజుల ఆట ముగిసింది. మరి టామ్ బ్లండెల్ సాధించిన రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Classic hundred at a crucial time from Tom Blundell 🔥#CricTracker #NZvENG #TomBlundell pic.twitter.com/vHchgvRLpv
— CricTracker (@Cricketracker) February 17, 2023