కొత్త సంవత్సరం వేడుకల్లో దేశం మెుత్తం మునిగిపోయి ఉంటే.. టీమిండియా క్రికెట్ లో మాత్రం విషాదం నెలకొంది. న్యూ ఇయర్ వేడుకలను తన కుటుంబంతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని రిషభ్ పంత్ తన స్వస్థలానికి బయలుదేరాడు. కానీ అనుకోని కారు ప్రమాదం కారణంగా తీవ్రంగా గాయపడ్డాడు పంత్. ఈ ప్రమాదం నుంచి పంత్ ను ఓ బస్ డ్రైవర్ కాపాడాడు. ప్రమాదంలో గయపడి అప్పటికే రక్తం కారుతున్న శరీరంతో ఉన్న పంత్.. గయపడ్డ తర్వాత బస్ డ్రైవర్ తో పలికిన తొలి మాటలను తాజాగా బస్ డ్రైవర్ సుశీల్ కుమార్ వెల్లడించాడు. అంత బాధలో ఉండి కూడా పంత్ పలికిన తొలి మాటలు వింటే మనకు సైతం కన్నీళ్లు ఆగవు.
న్యూ ఇయర్ వేడుకలను ఫ్రెండ్స్ తోనో లేక సన్నిహితులతోనో ఎంజాయ్ చేయాలని చాలా మంది అనుకుంటారు. కానీ కొద్ది మంది మాత్రమే కుటుంబంతో కలిసి జరుపుకుందాం అనుకుంటారు. అలాగే అనుకున్నాడు టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్. కుటుంబంతో కలిసి కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి తన ఇంటికి బయలుదేరాడు పంత్. కానీ దురదృష్టవశాత్తు.. పంత్ కారు ప్రమాదానికి గురైంది. ఈ యాక్సిడెంట్ లో పంత్ ప్రాణాలతో బయటపడ్డప్పటికీ అతడు అనుభవించిన బాధ మాత్రం వర్ణణాతీతం. ఇక పంత్ గాయపడ్డ సమయంలో మాట్లాడిన తొలి మాటలను తాజాగా వెల్లడించాడు పంత్ ను కాపాడిన బస్ డ్రైవర్. యాక్సిడెంట్ అయ్యి.. కాలిన గాయాలతో అంత బాధలో ఉన్నప్పటికీ పంత్ అతడి కుటుంబం కోసం ఆలోచించాడని, నేను అతడిని కలుసుకోగానే “మా అమ్మకు ఫోన్ చెయ్యవా ప్లీజ్” అంటూ పంత్ నాతో చెప్పాడు.
ఆ మాటల్లో ప్రేమ.. బాధ రెండూ కలిపి ఉన్నాయి. ఆ మాట వినగానే నా కళ్లలో నీళ్లు తిరిగాయి. అతడు చెప్పినట్లుగానే నేను చేశాను. ఆ తర్వాత అతడిని అంబులెన్స్ లో ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఏ వ్యక్తికైనా సరే తాను ప్రమాదంలో ఉన్నప్పుడు మెుదటిగా గుర్తుకు వచ్చేది కుటుంబమే. ముఖ్యంగా మనకు జన్మనిచ్చిన కన్నతల్లే. పంత్ కు సైతం ఇలాగే గుర్తుకు వచ్చింది తన మాతృమూర్తి. ప్రస్తుతం బస్ డ్రైవర్ సుశీల్ కుమార్ చెప్పిన పంత్ తొలి మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక తాజాగా పంత్ త్వరగా కోలుకోవాలని బీసీసీఐ సైతం ఓ స్పెషల్ వీడియోను కూడా రిలీజ్ చేసింది. అందులో టీమిండియా ఆటగాళ్లతో పాటు కోచ్ ద్రవిడ్ కూడా పంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Bus driver Sushil Kumar, who rescued Rishabh Pant recalls cricketer’s first words after the accident. #CricTracker #RishabhPant #SushilKumar pic.twitter.com/AoFxDj963q
— CricTracker (@Cricketracker) January 2, 2023