టీ20 వరల్డ్ కప్ 2022.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ప్రేక్షకులకు.. అంతే మజా ఇస్తూ ప్రారంభం అయ్యింది. ఆరంభంలోనే సంచలనాలు నమోదు చేస్తూ.. ఎంతో ఉత్కంఠగా మ్యాచ్ లు సాగుతున్నాయి. చిన్న జట్లు పెద్ద జట్లకు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాయి. అయితే ఇవన్నీ ఒకవైపు.. మరికొన్ని రోజుల్లో జరగబోయే ఇండియా-పాక్ మ్యాచ్ ఒకవైపు. ప్రపంచం మెుత్తం ఈ దాయాదుల పోరుకోసం ఎదురు చూస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు తగ్గట్లుగానే ప్రమోషన్స్ ను సైతం భారీగానే ప్లాన్ చేసింది ఐసీసీ. భారత్-పాక్ మ్యాచ్ కు ఏకంగా హాలీవుడ్ స్టార్ యాక్టర్ కమ్ WWE రెజ్లర్ అయిన డ్వేన్ జాన్సన్ అలియాస్ ‘ది రాక్’ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. దాంతో ఈ మ్యాచ్ పై మరింతగా బజ్ క్రియేట్ అయ్యింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
డ్వేన్ జాన్సన్.. అంటే ఎవరికీ తెలియదు. అదే ‘ది రాక్’ అంటే చాలు WWE గురించి కొద్దిగా తెలిసినా సరే వెంటనే చెప్పేస్తారు అతడో స్టార్ రెజ్లర్ అని. WWE రెజ్లింగ్ లో చాంపియన్ అయిన రాక్.. తర్వాత హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ.. హాలీవుడ్ లో సైతం తన మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. రాక్ కు స్వతాహాగా క్రికెట్ అంటే చాలా ఇష్టం. దాంతోనే ఇండియా-పాక్ మ్యాచ్ కు ప్రమోషన్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాక్ ఇండియా-పాక్ మ్యాచ్ గురించి మాట్లాడిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో తన గంభీరమైన కంఠంతో అంతే గంభీరంగా మాట్లాడాడు.”ప్రపంచ అత్యుత్తమ ప్రత్యర్థులు ఢీ కొనబోతున్నారు. దాని కోసం ప్రపంచం మెుత్తం నిలబడి ఎదురు చూస్తోంది. రాబోయే యుద్ధం ఇండియా-పాక్ మధ్య జరగబోతుంది. ఇది కేవలం మ్యాచ్ కాదు అంతకు మించి” అంటూ తనదైన కంచు కంఠంతో రాక్ చెప్తుంటే.. రోమాలు నిక్కబోడుచుకుంటున్నాయి.
ఇక ఈ వీడియో చూసిన అభిమానులు స్పందిస్తూ..”ఇది కదా ఇండియా-పాక్ మ్యాచ్ రేంజ్ అంటే అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరేమో కేవలం ఇండియా-పాక్ దేశాలే కాదు ప్రపంచం మెుత్తం ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తోందని చెప్పడానికి ఇంత కంటే గొప్ప సాక్ష్యం ఏముంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో రాక్ హవాతో క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ లెక్కన చూసుకుంటే భారత్-పాక్ మ్యాచ్ తోనే ప్రపంచ కప్ ప్రారంభం అయినట్లు అంటూ.. మరికొంత మంది క్రీడాభిమానులు అంటున్నారు. ప్రస్తుతం రాక్ బ్లాక్ ఆడమ్ అనే అడ్వంచరల్, యాక్షన్ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.
The Rock is here for India vs Pakistan. pic.twitter.com/c3ig0EQtQT
— Johns. (@CricCrazyJohns) October 18, 2022