మొన్నమొన్నటి వరకు శ్రీలంక క్రికెట్ జట్టుపై కనీస అంచనాల్లేవు. అలాంటి టైంలోనే అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది. ఏకంగా ఆసియాకప్ కొట్టేసింది. తమని తక్కువ అంచనా వేసిన వారందరూ నోళ్లు మూసుకునేలా చేసింది. ఇక టీ20 ప్రపంచకప్ ముందు ఇదంతా జరగడంతో.. ఈ టోర్నీలోనూ లంక అద్భుతం చేస్తుందేమోనని అందరూ భావించారు. కానీ తొలి మ్యాచ్ తోనే ఫుల్ డిసప్పాయింట్ చేసింది. ఎందుకంటే లంక జట్టు అంటే గెలుపు పక్కా అనుకున్నారు. కానీ మరీ నమీబియా లాంటి చిన్న జట్టుపై ఓడిపోతుందని అనుకోలేదు.
ఆదివారం జరిగిన ఆ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా.. 167 పరుగులు చేసింది. ఛేదనలో లంక జట్టు ఘోరంగా ఆడింది. 19 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటైపోయింది. సరేలే తొలి మ్యాచ్ కదా.. ఆసియాకప్ లోనూ ఇలానే ఓడిపోయింది. అయితేనేం కప్పు కొట్టేసింది కదా అని ప్రిడిక్షన్స్ చెప్పారు. కానీ గ్రూప్ దశలో యూఏఈ జట్టుతో ఆడిన మ్యాచులో మరో చెత్త రికార్డు తన పేరున లంక జట్టు నమోదు చేసింది. మంగళవారం జరిగిన మ్యాచులో లంక జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో యూఏఈ బౌలర్లు.. లంక బ్యాటర్లని ఫస్ట్ నుంచి తెగ ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు అదే కాదన్నట్లు లంక జట్టుపై యూఏఈ బౌలర్ హ్యాట్రిక్ సాధించాడు.
#KarthikMeiyappan #Hattrick #T20WorldCup2022 #SLvUAE#SLvsUAE
Karthik Meiyappan’s the First Player to Take Hattrick in this T20 World Cup 🔥🔥🔥pic.twitter.com/ltw8NCJz9z
— SR Cricket Fantasy (@CricketFantasyS) October 18, 2022
వివరాల్లోకి వెళ్తే… యూఏఈ బౌలర్ కార్తీక్ మెయ్యప్పన్ ఆసియాకప్ విజేత శ్రీలంక జట్టుకు భారీ షాక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ 15 ఓవర్ వేసిన ఇతడు.. తొలి మూడు బంతుల్లో మూడే పరుగులిచ్చాడు. చివరి మూడు బంతుల్లో హ్యాట్రిక్ తీసి అబ్బురపరిచాడు. ఈసారి టీ20 ప్రపంచకప్ లో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్ గా నిలిచాడు. దీంతో నెటిజన్స్… శ్రీలంక జట్టు ఆటతీరుపై విమర్శలు చేస్తున్నారు. ఆసియాకప్ గెలిచిన జట్టు.. ఇంతలోనే ఇలా మారిపోయిందేంటి అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచులో తొలి ఇన్నింగ్స్ పూర్తయ్యే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. మరి శ్రీలంక జట్టు ప్రస్తుత పరిస్థితిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
HAT-TRICK ALERT 🚨
Karthik Meiyappan has picked up the first hat-trick of #T20WorldCup 2022 👏
📝 Scorecard: https://t.co/fIoUF5AvN4
Head to our app and website to follow the action 👉 https://t.co/76r3b7l2N0 pic.twitter.com/gjSIhsr9rD
— ICC (@ICC) October 18, 2022
ఇదీ చదవండి: ఆసియా కప్ గెలిచినా.. శ్రీలంక బౌలర్ పేరిట వరెస్ట్ రికార్డు!