స్టేడియంలో అమ్మాయిలు డాన్సులేస్తున్నారని, మహిళా ప్రేక్షకులు హాజరువుతున్నారనే కారణంతో ఆఫ్ఘనిస్తాన్‌లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల ప్రసారాలను తాలిబన్లు నిషేధించారు. దేశంలోని వివిధ చానెల్ ల బ్రాడ్‌కాస్ట్‌లను ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేయకూడదని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తుంది. దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు తాలిబన్లను తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇప్పటికే మహిళలు స్పోర్ట్స్’లో పాల్గొనడంపై నిషేధం విధించిన తాలిబన్లు, పురుషులు క్రికెట్ ఆడేందుకు మాత్రం అనుమతించారు. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్లు రషీద్ ఖాన్, టీ20 జట్టు కెప్టెన్ నబీ ఐపీఎల్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే. తాలిబన్ల నిర్ణయంపై వారు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.