ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఇప్పటికే సూపర్ 12లో మూడు హాఫ్ సెంచరీలతో 246 పరుగులు చేసి టోర్నీలోనే టాప్ రన్ స్కోరర్‌గా ఉన్న విరాట్.. అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్‌తో సెమీస్‌లోనూ హాఫ్ సెంచరీతో సత్తా చాడు. 40 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 50 పరుగులు చేసిన కోహ్లీ.. క్రిస్ జోర్దాన్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్ చివరి బంతికి ఆదిల్ రషీద్‌కి క్యాచ్ ఇచ్చి.. అవుట్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌తో విరాట్ కోహ్లీ రెండు అరుదైన రికార్డులు నమోదు చేశాడు. టీ20 క్రికెట్లో 4 వేల పరుగులు పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించాడు.
ఈ అరుదైన రికార్డుతో పాటు మరో అద్భుతమైన రికార్డును కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 వరల్డ్ కప్స్‌లో విరాట్ కోహ్లీ 100 ఫోర్లు పూర్తి చేసుకున్నాడు. దీంతో టీ20 వరల్డ్ కప్ ఈవెంట్స్‌లో కోహ్లీ ఫోర్ల సెంచరీని నమోదు చేశాడు. ఈ వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 82 పరుగులతో టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించిన కోహ్లీ.. ఆ తర్వాత నెదర్లాండ్స్‌పై కూడా 62 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అలాగే బంగ్లాదేశ్‌పై కూడా హాఫ్ సెంచరీతో నాటౌట్‌గా నిలిచాడు. మళ్లీ సెమీస్‌లో ఇంగ్లండ్‌పై కేఎల్ రాహుల్ 5 పరుగులు చేసి త్వరగానే అవుటైనా.. ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో కూడా మంచి ఆరంభం అందించని కేఎల్ రాహుల్-రోహిత్ శర్మ జోడీ ఈ మ్యాచ్‌లో సైతం విఫలమైంది. 5 పరుగులు చేసి రాహుల్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లీ కొద్ది సేపు ఇన్నింగ్స్ నిలబెట్టినా.. 28 బంతుల్లో 27 పరుగులు చేసిన రోహిత్ 9వ ఓవర్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ 14 పరుగులు చేసి రషీద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఇక ఇక్కడి నుంచి పాండ్యా-కోహ్లీ జోడి టీమిండియాకు మంచి భాగస్వామ్య అందించింది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా 33 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులతో 63 పరుగులు చేసి టీమిండియా మంచి స్కోర్ అందించాడు. కానీ.. ఇన్నింగ్స్ చివరి బంతికి బౌండరీ బాదినా.. హిట్ వికెట్‌గా అవుట్ అయ్యాడు.
A Special TON! 👏 👏@imVkohli has now hit 1⃣0⃣0⃣ Fours in the #T20WorldCup! 🙌 🙌
Follow the match ▶️ https://t.co/5t1NQ2iUeJ #TeamIndia | #INDvENG pic.twitter.com/yuVockhlI7— BCCI (@BCCI) November 10, 2022