ఐసీసీ టీ20 వరల్డ్ కప్.. మరింత ఉత్కంఠగా మారుతోంది. న్యూజిలాండ్- ఇంగ్లాండ్ మధ్య జరిగిన పోరు.. ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగలిగారు. ఇంగ్లాండ్‌ని కట్టడి చేయడంలో న్యూజిలాండ్ విఫలమైందనే చెప్పాలి. జోస్ బట్లర్ వీర విహారం చేశాడు. 47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేశాడు. హేల్స్(52) కూడా అర్ధ శతకంతో రాణించాడు. లివింగ్‌స్టోన్ 20 పరుగులతో పర్వాలేదనిపించాడు. బౌలింగ్ పరంగా న్యూజిలాండ్ ఫెర్గూసన్‌కి 2 వికెట్లు, సౌథీ, శాంట్నర్, సోదీలకు తలో వికెట్ దక్కింది.
బ్యాటింగ్ పరంగానూ న్యూజిలాండ్ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లాండ్ 20 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. బ్యాటింగ్‌లో ఓపెనర్లు నిరాశ పరిచారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాత్రం 40 పరుగులతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. గ్లెన్ ఫిలిప్స్ బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 36 బంతుల్లో 62 స్కోర్ చేశాడు. ఫిన్ అలెన్(16), మిట్చెల్ శాంట్నర్(16*) పర్వాలేదనిపించారు. ఇంగ్లాండ్ బౌలింగ్‌లోనూ న్యూజిలాండ్‌ని ఇబ్బంది పెట్టింది. క్రిస్ వోక్స్, శామ్ కరన్‌లకు చెరో 2 వికెట్లు దక్కాయి. మార్క్ ఉడ్, బెన్ స్టోక్స్ చెరో వికెట్ పడగొట్టారు. వెరసి న్యూజిలాండ్ 20 పరుగుల తేడాతో ఓడిపోయింది.
Our #T20WorldCup dream is still alive!
Scorecard: https://t.co/zIxvMw3gn5#T20WorldCup | #England pic.twitter.com/HSg9LwSxKC
— England Cricket (@englandcricket) November 1, 2022
ఈ మ్యాచ్‌కు సంబంధించి నెట్టింట వైరల్ అవుతున్న విషయం ఏంటంటే.. భారత్- పాక్ మ్యాచ్ సీన్ రిపీట్ అయ్యింది. అవును.. ఇరు జట్లు ఒకానొక సమయంలో ఒకే స్థితిలో ఉన్నారు. న్యూజిలాండ్‌కి విజయం కోసం ఆఖరి 3 ఓవర్లలో 49 పరుగులు కావాల్సి వచ్చింది. ఇండియా- భారత్ మ్యాచ్‌లో కూడా విజయం కోసం టీమిండియాకి ఆఖరి 3 ఓవర్లలో 48 పరుగులు చేయాల్సి వచ్చింది. కచ్చితంగా ఓడిపోతారు.. వీళ్లు గెలవరు అని అంతా అనుకున్న సమయంలో కింగ్ కోహ్లీ మ్యాచ్ మొత్తాన్ని తిప్పేశాడు. 53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 82* పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అతనికి హార్దిక్ పాండ్యాకూడా తోడవ్వడంతో విజయం తథ్యమైంది. కానీ, న్యూజిలాండ్ జట్టులో ఫిలిప్, కేన్ తప్ప మరెవరూ రాణించలేదు. ఈ మ్యాచ్ రిజల్ట్ చూసిన క్రికెట్ ఫ్యాన్, ముఖ్యంగా టీమిండియా ఫ్యాన్స్.. ఇలాంటి మ్యాచ్‌లను గెలిపించాలి అంటే కోహ్లీకే సాధ్యం అంటూ గర్వంగా చెప్పుకుంటున్నారు.
Well played @englandcricket. All to play for now against @cricketireland on Friday in Adelaide! Scorecard | https://t.co/H8FXYsP9lj #T20WorldCup pic.twitter.com/Piz42qfNZW
— BLACKCAPS (@BLACKCAPS) November 1, 2022
He’s something else 🙌
Scorecard: https://t.co/zIxvMw3gn5#T20WorldCup | #England pic.twitter.com/AlHJ8i0w9s
— England Cricket (@englandcricket) November 1, 2022