టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022 షెడ్యూల్‌లో భాగంగా ఈ ఆదివారం(అక్టోబర్ 23న) భారత్-పాక్ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ.. మ్యాచ్ రద్దు కానుందనే వార్తలు క్రికెట్ అభిమానుల గుండెల్లో గుబులుపుట్టిస్తున్నాయి. కాకపోతే.. వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయ కలిగే అవకాశం ఉన్నట్లు ఇంతకుముందు వార్తలు వచ్చినా.. ప్రస్తుతానికి వెల్‌బోర్న్ వాతావరణం చక్కబడింది. షెడ్యూల్ ప్రకారం భారత్-పాక్ జరిగితే.. వర్షం వచ్చే అవకాశం లేదని అక్కడి వాతావరణ శాఖ తేల్చిచెప్పింది. వర్ష గండం తప్పిందనుకుని ఊపరిపీల్చుకున్న క్రికెట్ ఫ్యాన్స్‌పై మరో పెద్ద పిడుగేపడింది. అదేంటంటే.. బీసీసీఐపై కోపంతో పీసీబీ(పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) టీమిండియాతో మ్యాచ్‌ను రద్దు చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
పీసీబీ కోపానికి కారణం బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రకటన. ఆసియా కప్ 2023 కోసం టీమిండియాను పాకిస్థాన్ పంపేందుకు బోర్డు సభ్యులు సుముఖంగా ఉన్నట్లు ప్రకటించిన జైషా.. మరుసటి రోజు టీమిండియా పాకిస్థాన్ వెళ్లే ప్రకస్తే లేదని తేల్చిచెప్పాడు. అవసరమైతే ఆసియా కప్ 2023 వేదికను మారుస్తామని ఏసీసీ(ఏసియన్ క్రికెట్ కౌన్సిల్) ప్రెసిడెంట్‌గా ఉన్న జైషా ప్రకటించాడు. ఈ ప్రకటనతో ఖంగుతిన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. బీసీసీఐకి లేఖ రాసింది. ఏసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్న జైషా ఎలాంటి చర్చ, సంప్రదింపులు జరపకుండానే.. ఎప్పుడో నిర్ణయించబడిన ఆసియా కప్ 2023 వేదికను మారుస్తామని ఎలా ప్రకటిస్తారని మండిపడింది. ఆసియా కప్ 2023 పాకిస్థాన్‌లో నిర్వహించకపోయినా.. టీమిండియా ఆసియా కప్ ఆడేందుకు పాకిస్థాన్‌కు రాకపోయినా.. తాము కూడా 2023లో భారత్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్‌ను బాయ్‌కాట్ చేస్తామని, అలాగే ఏసీసీ నుంచి తప్పుకుంటామని హెచ్చరించింది.
ఈ విషయంపై బీసీసీఐ నుంచి కానీ, ఏసీసీ నుంచి కానీ ఎలాంటి స్పందనలేదు. దీంతో భారత్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్ 2023ను పాకిస్థాన్ బాయ్‌కాట్ చేయడంతో పాటు ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా మ్యాచ్‌ను సైతం బాయ్‌కాట్ చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. పాకిస్థాన్ క్రికెట్ అభిమానులతో పాటు, పాక్ మాజీ ఆటగాళ్లు సైతం భారత్-పాక్ మ్యాచ్ రద్దుకే పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏసీసీ నుంచి కానీ, బీసీసీఐ నుంచి ఎలాంటి ప్రకటన రాకుంటే.. మ్యాచ్ ఆడకుండా తమ నిరసన తెలియజేయాలని పాక్ క్రికెట్ బోర్డు పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. మరి ఈ విషయం ఎక్కడి దారి తీస్తుందో తెలియదు. కాగా.. ఆదివారం మ్యాచ్ కోసం మాత్రం ఇరు జట్ల ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు.
Melbourne Pak vs Ind ❤️#INDvsPAK#ICCT20WorldCup2022 pic.twitter.com/CT8UwyEeVT
— waqarbaloch786 (@waqaralijatoi11) October 15, 2022
Younis Khan — “Jay Shah is not representing BCCI only. He is President of Asian Cricket Council aswell. PCB should give strong response to BCCI. AsiaCup 2023 should be played in Pakistan no matter India participate or not.” #T20WorldCup
— Arfa Feroz Zake (@ArfaSays_) October 20, 2022
BCCI President: We have to get clearance from the government. Once we get clearance, we give a go-ahead. We can’t take the decision on our own.
Is the BCCI retracting it’s secretary’s ill-timed statements following a strong PCB response?https://t.co/46sldDDoPV— Faizan Lakhani (@faizanlakhani) October 20, 2022
Shahid Afridi praises PCB for giving ‘mature’ response to BCCI’s secretary Jay Shah’s statement over not playing #AsiaCup in Pakistan 👏#CricketTwitter pic.twitter.com/490Sac0aWD
— Cricket Pakistan (@cricketpakcompk) October 19, 2022