ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ ఊహించిన దానికంటే ఎంతో ఉత్కంఠగా సాగుతోందని క్రికెట్ అభిమానులు సంబరపడిపోతున్నారు. ఎందుకంటే ఈసారి వరల్డ్ కప్‌లో చాల అద్భుతాలు జరుగుతున్నాయి. ఇంగ్లాండ్‌పై ఐర్లాండ్ విజయం, పాక్‌ని ఓడించిన జింబాబ్వే వంటి ఎన్నో ఉత్కంఠ మ్యాచ్‌లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అటు ఇండియా కూడా ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచి మంచి ఉత్సాహంతో ఉంది. పాకిస్తాన్‌పై అద్భుత విజయం, నెదర్లాండ్స్‌పై సునాయాస గెలుపుతో మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది. తర్వాతి మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో కాబట్టి మరింత జాగ్రత్తగా ఆడాల్సి ఉంది. కానీ, జట్టు మొత్తం ఎంతో కాన్ఫిడెంట్‌గా కనిపిస్తోంది. కానీ, ఒకే ఒక్క ప్లేయర్ మాత్రం అందరి అంచనాలను అందుకోకపోవడమే కాకుండా.. ఇప్పటికే రెండుసార్లు నిరాశ పరిచాడు.
అవును.. మీరు అనుకున్నది కరెక్టే.. ఇప్పుడు చెప్పుకోబోయేది కేఎల్ రాహుల్ గురించే. ఓపెనర్‌గా జట్టుకు ఎంతో సపోర్ట్‌గా ఉంటాడని భావించిన కేఎల్ రాహుల్ జట్టుకు భారంగా మారాడు. ప్రతి మ్యాచ్‌లో అతనిలోని ఆత్మవిశ్వాసం మరింత సన్నిగిల్లుతోంది. ఎప్పటికప్పుడు తనని తాను నిరూపించుకుంటాడు అనుకుంటే.. ప్రతిసారి నిరాశ పరుస్తూనే ఉన్నాడు. నిజానికి పెద్ద పెద్ద జట్లు, కీలక మ్యాచ్‌లలో కేఎల్ రాహుల్ సరిగ్గా ప్రదర్శన చేయలేడని మొదటి నుంచి ఉన్న అపవాదే. దానికి ఇప్పుడు కొత్తగా నెదర్లాండ్స్ మ్యాచ్‌లో పరాభవంతో చిన్న జట్లు అన్నాకూడా రాహుల్‌కి భయమే అంటూ ట్రోల్ చేస్తున్నారు. కేఎల్ రాహుల్ ఎంతో సత్తా కలిగిన ఆటగాడు అని అందరికీ తెలుసు. కానీ, ఇంకా ఎంతకాలం అతను ఫామ్‌లోకి రావాలని ఎదురుచూడాలి అని ప్రశ్నిస్తున్నారు.
అంతేకాకుండా నెదర్లాండ్స్ మ్యాచ్‌లో నాటౌట్ అయితే ఫీల్డ్ అంపైర్ నిర్ణయంతో రాహుల్ వెనుతిరిగాడు. రివ్యూ తీసుకుని ఉంటే అది నాటౌట్ అని తెలిసేది. కానీ, రాహుల్ రివ్యూ తీసుకోవాలని ప్రయత్నించలేదు. దానిపై ఇప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ ఫైర్ అయ్యాడు. వాస్తవానికి కేఎల్ రాహుల్ అది నాటౌట్ ఏమో అని అనుమానం వ్యక్త పరిచాడు. కానీ, రోహిత్ శర్మ అది ఔట్ లాగే ఉంది అని చెప్పుకొచ్చాడు. వెంటనే రాహుల్ మైదానాన్ని వీడాడు. అయితే అతను ఉన్న పరిస్థితిలో రివ్యూ తీసుకుని ఉండాల్సింది అని సెహ్వాగ్ అభిప్రాయ పడ్డాడు. తీసుకుంటే ఏమౌతుంది.. మహా అయితే రివ్యూ పోతుంది. అదే నాటౌట్ అని వస్తే పరుగులు వచ్చేవి కదా అంటూ సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
When?…..God ?…
😕🙃#KLRahul #T20WorldCup2022 pic.twitter.com/dKw7mdfCAg— 🅻︎🅾︎🆁︎🅳︎🅶︎🅾︎🅳︎_🅺︎🅻︎🆁︎🦁👑 (@LordGod188) October 27, 2022
కేఎల్ రాహుల్ ఆట తీరుపై సెహ్వాగ్ మాట్లాడుతూ.. “కేఎల్ రాహుల్ నెదర్లాండ్స్ మ్యాచ్‌లో అవుటైన విధానం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఫీల్డ్ అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఇచ్చినప్పుడు డీఆర్‌ఎస్ తీసుకోవాల్సింది. కానీ, రాహుల్ ఎందుకు తీసుకోలేదో నాకు అర్థం కాలేదు. డీఆర్‌ఎస్‌కి వెళ్తే ఏమౌతుంది? అయితే నాటౌట్ అని వస్తుంది. లేదా ఔట్ అని వస్తుంది. ఔట్ అని వస్తే ఒక రివ్యూ వేస్ట్ అవుతుంది. కానీ, నాటౌట్ అని వస్తే నీకు పరుగులు చేసే అవకాశం వస్తుంది. నీ జట్టుని మరింత సుస్థిర స్థానంలో నిలిపే అవకాశం నీకు దక్కుతుంది. రివ్యూకి వెళ్తే వేస్ట్ అవుతుందని అలా చేసినట్లు అనిపించింది. నేను 2011లో జట్టులో ఒక రూల్ పెట్టాను. రెండు రివ్యూల్లో ఒకటి నాకు, రెండోది జట్టు కోసం అని చెప్పాను. బంతి నా ప్యాడ్స్ కి తిగిలి ఔట్ ఇస్తే.. నేను రివ్యూకి వెళ్తాను. చాలాసార్లు నాకు అది ఉపయోగపడింది కూడా. రాహుల్ ఫామ్‌లో లేడు. ఇలాంటి పరిస్థితుల్లో రివ్యూ తీసుకోవడానికి అసలు వెనుకాడకూడదు” అంటూ సెహ్వాగ్ ఒకింత అసహాన్ని వ్యక్త పరిచాడు.
“Ek KL Rahul hai, agar vo DRS le lete toh vo bhi run banaate. Out nahi thi vo, unhone pata nahi kyun nahi liya. (If KL Rahul had taken a DRS, he would havew scored runs. He wasn’t out, I don’t know why he didn’t take a review),”
virendra Sehwag said on Cricbuzz.#klrahul pic.twitter.com/1cQVysDuWR— Lalit Bhati (@_imlalit_19) October 27, 2022
Former Indian opener @virendersehwag has his say on KL Rahul’s LBW in 2nd match against Netherland.#T20WorldCup #cricketnews #T20WorldCup2022 #Cricket #TeamIndia #KLRahul #sehwag#T20worldcup22 pic.twitter.com/OWM36PyUjI
— CricInformer(Cricket News & Fantasy Tips) (@CricInformer) October 28, 2022