టీమిండియా మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ క్రికెట్ జట్టు షాక్‌లోకి వెళ్లింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు షాన్ మసూద్ ప్రాక్టీస్‌లో కుప్పకూలిపోయాడు. మరో స్టార్ బ్యాటర్ నవాజ్ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. బంతి వెళ్లి మసూద్‌ను తల వెనుక భాగంగా బలంగా తాకింది. దీంతో మసూద్ అక్కడిక్కడే కుప్పకూలాడు. 10 నిమిషాలతో నొప్పితో విలవిలలాడటంతో అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఊహించని ప్రమాదంతో పాకిస్థాన్ టీమ్‌లో ఒకలాంటి నిశబ్ధం అలుముకుంది. బ్యాటింగ్ చేసిన నవాజ్.. క్రీజ్‌లోనే మొక్కల్లాపై కూర్చోని ఎంత పని జరిగిపోయిందంటూ కంగారు పడ్డాడు. ఈ ఘటనతో పాకిస్థాన్ జట్టును శోకం అవహించింది.
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం భారత్-పాక్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. అలాగే పాక్ ప్లేయర్లు సైతం మెల్‌బోర్న్ గ్రౌండ్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న నవాజ్ కొట్టిన ఒక భారీ షాట్ నేరుగా వెళ్లి.. ప్రాక్టీస్‌లో భాగంగా అక్కడే ప్యాడ్లు కట్టుకుని నిల్చున్న షాన్ మసూద్ తలకు బంతి బలంగా తాకింది. దీంతో అతను నేలపై పడిపోయాడు. మిగతా జట్టు సభ్యులతో పాటు పాక్ టీమ్ ఫిజియో వెంటనే స్పందించి మసూద్‌ను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.
టీమిండియాతో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్‌కు ఈ ఘటన పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. వరల్డ్ కప్ కోసం రెండు వారాల ముందే ఆస్ట్రేలియా వచ్చిన పాకిస్థాన్.. ఇంగ్లండ్ ఒక వామప్ మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో ఓడిన పాక్.. తర్వాత అఫ్ఘానిస్థాన్‌తో మరో వామప్ మ్యాచ్ వర్షం కారణంగా మధ్యలోనే నిలిచిపోయింది. కాగా.. గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ 2021లో భారత్‌ను పాకిస్థాన్ ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓడించింది. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు రోహిత్ సేన పట్టుదలతో ఉంది. కాగా.. ఇటివల జరిగిన ఆసియా కప్ 2022లో రెండు మ్యాచ్‌ల్లో తలపడిన భారత్-పాక్.. చెరో విజయంతో సమువుజ్జీలుగా నిలిచాయి.
Shan Masood Injured during practice session Bal hit on the head Shifted to hospital for scns#T20WorldCup pic.twitter.com/wzEs0fwQpf
— saimi🌻 (@Pakistanii_kuri) October 21, 2022
A moment of extreme scare. Mohammad Nawaz is distraught and down on the ground after his shot hits Shan Masood flash at the back of his neck😳
Watch this exclusive footage on @Sportskeeda. #T20WorldCup #INDvsPAK pic.twitter.com/9JrhGQ0ZSg
— Srinjoy Sanyal (@srinjoysanyal07) October 21, 2022