ఏ గేమ్ అయినా సరే ఫిట్ నెస్ కచ్చితంగా మెంటైన్ చేయాలి. లేదంటే ఆటలో వెనకబడిపోతాం. గెలిచే ఛాన్సులు తగ్గిపోతాయి. అందుకే క్రికెటర్ల దగ్గర నుంచి హాకీ, కబడ్డీ లాంటి గేమ్స్ ఆడే ప్లేయర్స్ జిమ్, వర్కౌట్స్ చేస్తూ శరీరాన్ని షేప్ లో ఉంచుతారు. తద్వారా గ్రౌండ్ లో చురుగ్గా కదలడానికి వీలుంటుంది. ఇక టీమిండియా విషయానికొస్తే.. కొన్నాళ్ల ముందు వరకు లెక్క వేరే ఉండేది. కానీ కోహ్లీ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య లాంటి వాళ్లు.. ఫిట్ నెస్ లెక్కలు పూర్తిగా మార్చేశారు. వీళ్లని చూసి మిగతా ఆటగాళ్లు కూడా సిక్స్ ప్యాక్ లు మెంటైన్ చేస్తున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీ20 ప్రపంచకప్ కోసం అన్ని జట్లు పూర్తి సన్నద్ధతతో ఉన్నాయి. వార్మప్ మ్యాచులు ఆడుతూ ఫుల్ బిజీ అయిపోయాయి. తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన వార్మప్ మ్యాచులో పాక్ జట్టు ఘోరంగా ఓడిపోయింది. 161 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. దీంతో నాలుగు ఓవర్లు మిగిలుండగానే ఇంగ్లాండ్ జట్టు టార్గెట్ పూర్తి చేసేసింది. ఈ క్రమంలోనే పాక్ ఆటగాళ్ల ఫిట్ నెస్ పై ఆ దేశ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ మండిపడ్డాడు. క్రికెటర్ల పొట్టలు కనిపిస్తున్నాయని, నడుం దిగువ భాగంలో బరువు పెరిగిపోవడం వల్ల గ్రౌండ్ లో అస్సలు కదల్లేకపోతున్నారని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ విషయం కాస్త క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
‘క్లియర్ గా ఫిట్ నెస్ సమస్యలు కనిపిస్తున్నాయి. వఖార్ నాలుగుసార్లు కోచ్ గా తప్పుకొన్నాడు. నేను ఓసారి తప్పుకొన్నా. నేను, షోయాబ్ మాలిక్, యూనిస్ ఖాన్ లాంటి వాళ్లు ఫిట్ నెస్ పై బాగా శ్రద్ధపెట్టేవాళ్లం. ఎప్పటికప్పుడు బాడీని షేప్ లో ఉంచేందుకు శ్రమించేవాళ్లం. ఇప్పుడు ఆటగాళ్ల పొట్టలు కనిపిస్తున్నాయి. నడుం కింద భాగంలో బరువు పెరిగిపోయి కదల్లేకపోతున్నారు. జట్టులో చోటు దక్కడానికి ఫిట్ నెస్ పరంగా ఎలాంటి ప్రమాణాలు లేకపోవడమే దీనికి కారణం. దీనిపై క్రికెటర్ల శ్రద్ధపెట్టాలంటే.. దేశవాళీ స్థాయిలో మార్పు రావాలి. అలా అయితేనే రాబోయే తరం ఆటగాళ్లని కాపాడుకోగలం’ అని మిస్బా ఫైర్ అయ్యాడు. ఇదిలా ఉండగా 16 ఏళ్ల పాటు అంతర్జాతీయ కెరీర్ కొనసాగించిన మిస్బా.. పలు రికార్డులు కూడా తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఇక రిటైర్మెంట్ తర్వాత పాక్ జట్టు హెడ్ కోచింగ్ తో పాటు చీఫ్ సెలెక్టర్ గానూ బాధ్యతలు నిర్వర్తించాడు. కానీ ఆ రెండింటిని కూడా వ్యక్తిగత కారణాల వల్ల ఏడాది వ్యవధిలో వదిలేసుకున్నాడు. మరి పాక్ క్రికెటర్లపై మిస్బా షాకింగ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Pakistan former head coach Misbah ul Haq is not happy with the fitness standards of the players #CricketTwitterhttps://t.co/DvTnLqOPr4
— CricWick (@CricWick) October 18, 2022