పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఆసియా కప్ 2023 టోర్నీలో భారత జట్టు పాల్గొంటుందా? లేదా? అన్న విషయంపై సాగుతున్న సస్పెన్స్‌కి బీసీసీఐ తెరదించింది. పాకిస్తాన్‌లోనే టోర్నీ నిర్వహిస్తామంటే అందులో టీమిండియా పాల్గొనడం జరగని పని అని బీసీసీఐ సెక్రటరీ జై షా చెప్పుకొచ్చాడు. బీసీసీఐ వార్షిన సాధారణ సమావేశం(AGM)లో ఈ విషయంపై చర్చించినప్పటికీ.. కేంద్రం అనుమతిస్తే పర్యటిస్తాం అన్నట్లుగా వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలను బీసీసీఐ ఖండించింది. ‘ఆరునూరైనా పాక్‌లో అడుగుపెట్టం..’ అని తేల్చిచెప్పింది.
వచ్చే ఏడాది అక్టోబర్/నవంబర్ నెలల్లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగాల్సివుంది. అయితే ఈ టోర్నీకి ముందుగానే పాకిస్తాన్‌లో వన్డే ఫార్మాట్‌లో ఆసియా కప్ 2023 జరగాల్సి ఉంది. అయితే పాక్‌లో జరిగే ఈ టోర్నీలో భారత జట్టు పాల్గొంటుందా? లేదా? అంటే గత కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొన్నాళ్ల క్రితం జరిగిన బీసీసీఐ వార్షిన సాధారణ సమావేశం (AGM)లో కూడా ఈ విషయం గురించి చర్చించారు. కేంద్రం అనుమతిస్తే పాక్ లో పర్యటించడానికి బీసీసీఐ సభ్యులు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్‌లో పర్యటించడం కరెక్ట్ కాదని కేంద్రం భావించదట. దీంతో పాక్ వేదికగా టోర్నీ నిర్వహిస్తామంటే టీమిండియాపాల్గొనడం జరగదని బీసీసీఐ సెక్రటరీ జై షా స్పష్టం చేశాడు.
Jay Shah (in Cricbuzz) confirms India won’t travel to Pakistan for Asia Cup 2023.
— Johns. (@CricCrazyJohns) October 18, 2022
తటస్థ వేదికలుగా టోర్నీ నిర్వహిస్తే బీసీసీఐకి ఎలాంటి అభ్యంతరం లేదు అన్నట్లుగా జై షా చెప్పుకొచ్చాడు.”తటస్థ వేదికపై ఆసియా కప్ 2023 నిర్వహించాలని ఏషియా క్రికెట్ అసోసియేషన్‌కి సూచించాం. ఎందుకంటే.. భారత జట్టు, పాకిస్తాన్‌లో పర్యటించడానికి సిద్ధంగా లేదు..” అని జై షా తెలిపాడు. ఇటీవల ముగిసిన ఆసియా కప్ 2022 టోర్నీ శ్రీలంక వేదికగా జరగాల్సిఉన్నా.. ఆర్థిక సంక్షోభం కారణంగా టోర్నీని నిర్వహించలేమని లంక క్రికెట్ బోర్డు చేతులు ఎత్తేయడంతో యూఏఈ వేదికగా ఈ టోర్నీని నిర్వహించారు. ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితులే పునారావృతం కానున్నాయి.
We’ll have Asia Cup 2023 at a neutral venue. It’s the govt which decides over the permission of our team visiting Pakistan so we won’t comment on that but for the 2023 Asia Cup, it is decided that the tournament will be held at a neutral venue: BCCI Secretary Jay Shah
(File Pic) pic.twitter.com/mvWlqlsgei
— ANI (@ANI) October 18, 2022