ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శనే కనబర్చింది. వెస్టర్న్ ఆస్ట్రేలియాతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి, మరొకటి ఓడినా.. బ్యాటింగ్ పరంగా మంచి ప్రదర్శన ఇచ్చింది. అలాగే సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన వామప్ మ్యాచ్‌లోనూ టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలతో రాణించడంతో 186 పరుగుల మంచి స్కోర్ చేసింది. కానీ.. ఈ టార్గెట్‌ను ఆసీస్ బ్యాటర్లు ఈజీగా ఛేజ్ చేస్తూ కనిపించారు. చివర్లో విరాట్ కోహ్లీ సూపర్ ఫీల్డింగ్‌కి తోడు.. లాస్ట్ ఓవర్లో సూపర్ బౌలింగ్‌తో షమీ మ్యాచ్‌ను గెలిపించారు.
ఈ వామప్ మ్యాచ్‌లో కేవలం ఒకే ఓవర్ వేసిన షమీ.. ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను గెలిపించి భారత్ చేతుల్లోపెట్టాడు. కేవలం 11 పరుగులను డిఫెండ్ చేయాల్సిన దశలో తొలి రెండు బంతుల్లో 4 పరుగులు ఇచ్చి.. తర్వాత నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి.. 6 పరుగుల తేడాతో భారత్‌ను గెలిపించాడు. తొలుత బీసీసీఐ ప్రకటించిన టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో షమీకి స్థానం దక్కలేదు. కేవలం స్టాండ్‌బై ప్లేయర్‌గా ఉన్న షమీ.. భారత ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నుముక గాయంతో వరల్డ్ కప్ దూరం కావడంతో షమీకి తుది జట్టులో ఆడే అవకాశం దక్కింది. ఈ వామప్ మ్యాచ్‌కు మూడు రోజుల ముందే షమీ.. నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ టెస్టు పాసై.. ఆస్ట్రేలియా వచ్చాడు. వచ్చిరావడంతోనే నెట్స్‌లో శ్రమించి.. ఆసీస్‌పై ఒక్క ఓవర్‌తోనే తన సత్తా చాటాడు.
షమీ ప్రదర్శనపై యాదవ్ క్రికెట్ అభిమానులతో పాటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆటగాళ్లు ఫుల్ ఖుషీగా ఉంటే.. టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా మాత్రం మరో విధంగా స్పందించాడు. బుమ్రా స్థానానికి షమీ ఫర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రైనా మాట్లాడుతూ..‘షమీ మంచి ప్రదర్శన ఇచ్చాడు. అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు. కానీ.. బుమ్రాకు అతను ఫర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ కాదు. ఎందుకంటే బుమ్రాను, రవీంద్ర జడేజాను ఎవరూ రీప్లేస్ చేయలేరు. వాళ్లు జట్టుకు నిలకడైన ప్రదర్శనలు ఎన్నో ఇచ్చారు.’ అని రైనా అన్నాడు. కాగా.. రైనా వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. షమీ ఇంత మంచి ప్రదర్శన ఇచ్చిన తర్వాత కూడా రైనా ఇలా తక్కువ చేసి మాట్లాడటం సరికాదని, బుమ్రా, షమీ ఇద్దరికి ఇద్దరూ ఛాంపియన్ బౌలర్లని పేర్కొంటున్నారు.
Mohammed Shami is not a perfect replacement for Jasprit Bumrah – Suresh Raina https://t.co/HgXF0ddzRv
— Crictoday (@crictoday) October 18, 2022
That’s interesting!https://t.co/mub1pl5jRs
— HT Sports (@HTSportsNews) October 18, 2022