టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో టీమిండియా ఘోర పరాజయంపై పోస్టుమార్టం కొనసాగుతూనే ఉంది. ఇంగ్లండ్ చేతిలో ఎదురైన ఓటమి నుంచి భారత క్రికెట్ అభిమానులు బయటికి రాలేకపోతున్నారు. సూపర్ 12లో అద్భుతంగా రాణించిన జట్టేనా ఇంగ్లండ్‌తో సెమీస్ ఆడింది అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఓటమికి కారణం ఫలానా క్రికెటర్ అంటూ.. అతని వల్లే ఓడిందంటూ ఎవరికి తోచిన విశ్లేషణ వారు ఇస్తున్నారు. కాగా.. అభిమానుల ఆగ్రహానికి ఎక్కువగా గురవుతున్న క్రికెటర్ మాత్రం కేఎల్ రాహులే. ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియాకు ఈ పరిస్థితి రావడానికి కారణం.. కేఎల్ రాహులే అంటూ మండిపడుతున్నారు. అతన్ని వెంటనే జట్టు నుంచి తప్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ కంటే బెస్ట్ ఓపెనర్.. డ్రింగ్ ఓపెనర్ అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
అయితే రాహుల్‌పై ఇంతగా అభిమానులు విరుచుపడేందుకు కారణం.. అతని బ్యాటింగ్ అప్రోచే. టీ20 లాంటి షార్ట్ ఫార్మాట్‌లో పవర్‌ప్లేలో ఎంతో కీలకం. ఫీల్డింగ్ పరిమితులు ఉంటాయి కనుక.. వీలైన్ని ఎక్కువ పరుగులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఏ జట్టు ఓపెనర్లు అయినా.. షాట్లు ఆడి వేగంగా పరుగులు చేసేందుకు ప్రయత్నిస్తారు. అగ్రెసివ్ అప్రోచ్‌తో పవర్ ప్లేను సాధ్యమైనంత మేర ఉపయోగించుకుంటారు. కానీ.. కేఎల్ రాహుల్ మాత్రం అగ్రెసివ్ అప్రోచ్‌కు విరుద్ధంగా చాలా నిదానంగా ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నాడు. భయంభయంగా బ్యాటింగ్ చేస్తూ.. ప్రత్యర్థి బౌలర్లుకు లేని కాన్ఫిడెన్స్‌ను రాహులే చేతులారా ఇస్తున్నాడు. ఈ వరల్డ్ కప్‌లో టీమిండియాకు ఒక్క మ్యాచ్‌లో కూడా మంచి స్టార్ట్ లభించలేదు. దీంతో తర్వాత వచ్చే బ్యాటర్లపై తీవ్ర ఒత్తిడి పడుతుంది.
వరల్డ్ కప్‌లో కేఎల్ రాహుల్ రెండు హాఫ్ సెంచరీలు బాదినా.. అవి రెండు కూడా చిన్న జట్లపైనే కొట్టాడు. హాఫ్ సెంచరీతో వచ్చిన కాన్ఫిడెన్స్‌ను సెమీస్ లాంటి కీలక మ్యాచ్‌లోకూడా రాహుల్ చూపించలేకపోయాడు. అగ్రెసివ్ అప్రోచ్ లేకపోవడం వల్ల పవర్ ప్లేలో టీమిండియా టెస్టు మ్యాచ్ ఆడినట్లు ఆడుతోంది. రాహుల్ స్లో బ్యాటింగ్‌తో మరో ఓపెనర్ రోహిత్ శర్మపై ఒత్తిడి పెరిగి.. పరుగుల కోసం ఓవర్ అగ్రెసివ్ షాట్లు ఆడి రోహిత్ అవుట్ అవుతున్నాడు. ఈ విధంగా కేఎల్ రాహుల్ స్లో బ్యాటింగ్‌తో తనతో పాటు రోహిత్‌కు కూడా నష్టం చేస్తున్నాడు కేఎల్ రాహుల్. ఇప్పుడు… ఇదే విషయంపై క్రికెట్ అభిమానులు రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వన్డేల్లోనే అగ్రెసివ్ బ్యాటింగ్‌తో తొలి బంతికే ఫోర్ కొట్టి బౌలర్‌ను ఒత్తిడిలోకి నెట్టే.. సెహ్వాగ్‌ను చూసిన కళ్లతో పసలేని, పవర్‌లేని రాహుల్ బ్యాటింగ్ చూడలేకపోతున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అగ్రెసివ్ క్రికెట్‌కు మారుపేరైన వీరేంద్ర సెహ్వాగ్.. సచిన్‌తో కలిసి టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభించే వాడనే విషయం తెలిసిందే. బ్రెట్ లీ, షోయబ్ అక్తర్ లాంటి నిప్పులు చెరిగే బౌలర్ ఎదురుగా ఉన్నా.. తొలి బంతిని బౌండరీ బాదే కసి సెహ్వాగ్‌లో కనిపించేంది. 2011 వన్డే వరల్డ్ కప్‌లో సెహ్వాగ్ ఇదే అగ్రెసివ్ అప్రోచ్‌తో ముందుకెళ్లాడు. సెహ్వాగ్ తన బ్యాటింగ్‌తో తొలి ఓవర్ నుంచే బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టేవాడు. కొన్ని సార్లు తన అగ్రెసివ్ మైండ్‌సెట్‌తో అవుటైనా.. చాలా సార్లు టీమిండియాకు శుభారంభాలు అందించాడు. అసలు ఫస్ట్ బాల్‌కే ఫోర్ అంటే అందరికి గుర్తుకు వచ్చేది సెహ్వాగే.. ఇప్పుడు కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చూస్తున్న అభిమానులు సైతం.. సెహ్వాగ్ ఉంటే ఎంత బాగుడేంది అంటూ ఆ డాషింగ్ ఓపెనర్‌ని తలుచుకుంటున్నారు. ఇప్పటికైనా రాహుల్ తన బ్యాటింగ్ అప్రోచ్‌ను మార్చుకుంటే మంచిదని కోరుకుంటున్నారు.
Ek opener tha jo batting power play ko death overs ki tarah khelta tha @virendersehwag #KLRahul #RohitSharma #INDvsENG pic.twitter.com/LgpJ950DLw
— Dr. Panshul Pant (@panshul_pant) November 10, 2022
We miss you @virendersehwag #INDvsENG #KLRahul𓃵 #openers pic.twitter.com/jBQwqDPrEQ
— Gee News💎 (@yamraj_0001) November 10, 2022
Opener Ek tha Duniya main, @virendersehwag Jo aate hi Bowlers ko khouf main daal dete the,,
Aaj k opener to test khelne aate hai,,@klrahul @ImRo45 pic.twitter.com/RByUpI1L7B— Ŕáj Vishwakarma (@jVishwakarma3) November 10, 2022
#BCCI 💔💔
….by 10 Wickets 😇😇#Aswini & #AxarPatel pair of spinners selected for setting England batsmen…no effective 👍
#KLRahul‘s performance was unbelievable 🤪 #choker @imVkohli@virendersehwag @GautamGambhir @cricketaakash @msdhoni
why not @IamSanjuSamson pic.twitter.com/nRWTlEgH9I— राय बाबू (@iam_waiting4uu) November 10, 2022