టీ20 వరల్డ్ కప్ ఎంతో రసవత్తరంగా సాగుతున్నాయి. సూపర్ 12 పోటీలు చివరి అంకానికి వచ్చినా.. ఇంకా ఒక్క టీమ్ కూడా అధికారికంగా సెమీస్ చేరలేదంటేనే అర్థం అవుతోంది ఎంతటి టఫ్ ఫైట్ నడుస్తుందో. ఒక్కో గ్రూప్ నుంచి ఏకంగా మూడు మూడు జట్లు సెమీస్ బెర్త్ కోసం పోటీ పడుతున్నాయి. ఫలనా జట్టు కచ్చితంగా సెమీస్ చేరుతుందని చెప్పలేని పరిస్థితి నెలకొంది. గురువారం పటిష్టమైన సౌతాఫ్రికాపై పాకిస్థాన్ జట్టు విజయం సాధించిచడంతో మరింత సస్పెన్స్ ఏర్పడింది. గ్రూప్ బీ నుంచి సెమీస్ బెర్త్ కోసం టీమిండియా, సౌతాఫ్రికా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు పోటీ పడుతున్నాయి. వీటిలో టీమిండియా, సౌతాఫ్రికాకు సెమీస్ అవకాశాలు మెరుగ్గా ఉన్నా.. చిన్న జట్లు చెలరేగుతుండటంతో పాక్ జట్టు కూడా సెమీస్‌పై ఆశలు పెట్టుకుంది. టీమిండియా.. జింబాబ్వే చేతిలో లేదా సౌతాఫ్రికా నెదర్లాండ్స్ చేతిలోనో ఓడితే.. పాక్ సెమీస్‌కు చేరుతుంది. ఈ రెండు జరగడం కష్టమే అయినా.. ఎవరీ ఆశలు వారికున్నాయి.
అయితే.. గురువారం సౌతాఫ్రికాను ఓడించిన తర్వాత.. బాబర్ అజమ్ ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు. బాబర్ మాట్లాడుతూ..‘జట్టు ప్రదర్శనతో చాలా సంతోషంగా ఉన్నాను. నేను, రిజ్వాన్ మా స్థాయికి తగ్గుట్లు ఆడలేదు. కానీ.. హరీస్ ఒక ప్రత్యేకమైన ఆటగాడు.. తన ఆటతో మ్యాచ్ మూమెంటమ్ మార్చేశాడు. ఆ తర్వాత షాదాబ్, ఇఫ్తికర్ అద్భుతంగా ఇన్నింగ్స్‌ను ముగించారు. నిజం చెప్పాలంటే.. ప్రతి ప్లేయర్ నా బెస్ట్ ప్లేయరే. పాక్ టీమ్‌లో ప్రతి ఆటగాడు మ్యాచ్ విన్నరే. తొలి రెండు ఓటములు మాకెంతో నష్టం చేశాయి. కానీ.. తర్వాత రెండు మ్యాచ్‌ల్లో మేం అద్భుతంగా ఆడాం. క్రికెట్ ఒక ఫన్నీ గేమ్.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు.’ అని బాబర్ అన్నాడు.
కాగా పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే.. బంగ్లాదేశ్‌తో తమ చివరి మ్యాచ్‌లోనూ పాకిస్థాన్ భారీ విజయం సాధించాలి. అదే సమయంలో టీమిండియా జింబాబ్వే చేతిలో ఓడాలి. లేదా.. సౌతాఫ్రికాను నెదర్లాండ్స్ జట్టు ఓడించాలి. ఈ మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌లు పాకిస్థాన్‌కు అనుకూలంగా జరిగితే.. పాక్ 6 పాయింట్లతో సెమీస్ చేరుతుంది. టీమిండియా జింబాబ్వేపై విజయం సాధిస్తే.. 8 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా సెమీస్ వెళ్తుంది. సౌతాఫ్రికా నెదర్లాండ్స్‌పై గెలిస్తే.. 7 పాయింట్లతో సెమీస్ చేరడం పక్కా. ఇక టీమిండియా, సౌతాఫ్రికా తమ చివరి మ్యాచ్‌ల్లో గెలిస్తే.. పాకిస్థాన్ అధికారికంగా ఇంటికి వెళ్తుంది. ఏదో అద్భుతం జరిగితే తప్పా.. పాకిస్థాన్ సెమీస్ చేరడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.
Babar Azam hoping things go in favor of Pakistan 😬#PAKvSA #T20WorldCup pic.twitter.com/nAkFvXaBQ4
— Cricket Pakistan (@cricketpakcompk) November 3, 2022