భారత్, పాకిస్థాన్ లాంటి హేమాహేమీ జట్లను ఓడించి ఇటివల ఆసియా కప్ 2022 ఛాంపియన్‌గా నిలిచిన శ్రీలంక.. టీ20 వరల్డ్ కప్‌లో మాత్రం తొలి మ్యాచ్‌లోనే చతికిల పడింది. పటిష్టమైన శ్రీలంకకు షాకిస్తూ.. నమీబియా టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లోనే సంచలనం సృష్టించింది. బలమైన జట్లకు కొన్ని పిసికూన జట్ల నుంచి ప్రమాదం పొంచి ఉందని ఇప్పటికే మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డ క్రమంలో.. చిన్న టీమ్ నమీబియా వరల్డ్ కప్ ప్రారంభ బ్యాచ్‌లోనే ఆ విషయాన్ని నిజం చేసింది. ఆదివారం గ్రూప్ స్టేజ్‌లో నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక చిత్తుచిత్తుగా ఓడింది. సూపర్ 12కు అర్హత సాధించడంలో లంక తొలి మ్యాచ్‌లోనే ఓడి తమ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
లంక బౌలర్లను ఊతికేసిన నమీబియా..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా లంక బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగుల స్కోర్ చేసింది. నమీబియా ఓపెనర్లును త్వరగానే పెవిలియన్ చేర్చిన లంక బౌలర్లు.. తర్వాతి బ్యాటర్లపై అంతగా ప్రభావం చూపలేకపోయారు. 16 పరుగులకే ఓపెనర్లను కోల్పోయినా.. నమిబియా మంచి స్కోర్ సాధించింది. నమిబియా స్టార్ ఆల్‌రౌండర్ జాన్ ఫ్రైలింక్ బ్యాట్ బాల్‌తో చెలరేగిపోయాడు. తొలుత బ్యాటింగ్‌లో కేవలం 28 బంతుల్లోనే 4 ఫోర్లతో 44 పరుగులు చేసి రాణించాడు.
పేకమేడలా కూలిన లంక ఇన్నింగ్స్..
ఇక 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఏ దశలోనూ విజయం వైపు సాగలేదు. నమిబియా బౌలర్ల ముందు లంక బ్యాటర్లు నిలువలేకపోయారు. కెప్టెన్ షనంకా మాత్రమే 29 పరుగులతో లంక ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శ్రీలంక స్టార్ బ్యాటర్లు.. నిస్సంకా(9), కుసల్ మెండిస్(6), గుణతిలకా(0) దారుణంగా విఫలం అయ్యారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన శ్రీలంక 19 ఓవర్లలో కేవలం 108 పరుగులకే ఆలౌటై.. దారుణ ఓటమిని చవిచూసింది. నమిబియా బౌలర్లలో జాన్ ఫ్రైలింక్ 2, డేవిడ్ వైసిస్ 2, బెర్నార్డ్ 2, బెన్ షికోంగో 2, జేజే స్మిత్ ఒక వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో టీ20 వరల్డ్ కప్ 2022లో సూపర్ 12 స్టేజ్‌లో ఆడేందుకు నమిబియా తమ అవకాశాలను మెరుగుపర్చుకుంది.
Namibia start their World Cup campaign in some style! 💥🌟
After posting 163 on the board, they bowl out Sri Lanka for 108.👏#T20WorldCup | #SLvNAM https://t.co/gPlHpjLWI2 pic.twitter.com/BB0pQQeipk
— Cricbuzz (@cricbuzz) October 16, 2022