టీ20 ప్రపంచకప్ 2022 పోరుకు సమయం ఆసన్నమైంది. టోర్నీ ఆరంభం కావడానికి ఇక కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలివుంది. ఈ నేపథ్యంలో శనివారం ‘కెప్టెన్స్ డే’ని నిర్వహించింది.. ఐసీసీ. ఇందులో 16 జట్ల కెప్టెన్లు పాల్గొని ఫోటోలకు పోజులిచ్చారు. ఐసీసీ ప్రొటోకాల్ ప్రకారం.. ఇతర జట్ల కెప్టెన్లతో కలిసి ఒక్కొక్కరుగా ఫోటోలు దిగారు. ఈ ఈవెంట్ లో పాకిస్తాన్ సారధి బాబర్ ఆజమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అందుకు కారణం.. నేడు అతని పుట్టినరోజు కావడమే. ఈ క్రమంలో ఇతర జట్ల కేప్టెన్లందరూ అతనికి బర్త్‌డే విషెస్ తెలిపారు.
1994 అక్టోబర్ 15న జన్మించిన బాబర్ ఆజాం నేటితో 28వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ‘కెప్టెన్స్ డే’ని ఘనంగా నిర్వహించిన ఐసీసీ.. ఫోటో షూట్ సమయంలోనే అతని చేత కేక్ కటింగ్ చేయించింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఈవెంట్ లో 16 మంది కెప్టెన్లున్నా.. అందులో ‘రోహిత్ – బాబర్’ జోడి మాత్రమే హైలైట్ అవ్వడం గమనార్హం. ఐసీసీ ప్రొటోకాల్ ప్రకారం.. రెండు జట్ల కెప్టెన్లు ఫొటోషూట్‌లో పాల్గొనడం ఆనవాయితీ. దీన్ని కొనసాగించారు ఇద్దరు. డిఫరెంట్ స్టయిల్లో ఫొటోలకు ఫోజులిచ్చారు. కాకుంటే.. అవి మొదటికే మోసం తెచ్చాయి. ‘ప్రీ వెడ్డింగ్ షూట్’ లా ఉందంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.
Babar Azam spends his 𝟐𝟖𝐭𝐡 birthday in fine company 🥳🤩#T20IWorldCup pic.twitter.com/uRZ40yzKCd
— Sport360° (@Sport360) October 15, 2022
Special guests for the birthday of 🇵🇰 ©️! 🎊😊
We invited all the team captains at the @T20WorldCup to celebrate Babar Azam’s birthday 🎂🙌 pic.twitter.com/WZFzYXywsO
— Pakistan Cricket (@TheRealPCB) October 15, 2022
టీ20 ప్రపంచకప్ సూపర్-12 సమరానికి ముందు తొలి రౌండ్ మ్యాచులు(క్వాలిఫయర్) జరుగుతాయి. సూపర్-12లో ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలను దక్కించుకోవడం కోసం తొలి రౌండ్ లో ఎనిమిది జట్లు పోటీపడతాయి. ఇప్పటికే అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా సూపర్-12కు అర్హత సాధించగా, అర్హత రౌండ్ లో గ్రూప్- ఎలో నమీబియా, నెదర్లాండ్స్, శ్రీలంక, యూఏఈ, గ్రూప్- బిలో ఐర్లాండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్, జింబాబ్వే పోటీపడనున్నాయి. గ్రూప్ దశ ముగిసే సరికి ఒక్కో గ్రూప్ తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-12కు అర్హత సాధిస్తాయి. ఆపై.. ఈ నెల 22 నుంచి సూపర్-12 సమరం మొదలవుతుంది. కాగా, ఈ నెల 23న టీమిండియా తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీ కొట్టబోతోంది.
T20 WORLD CUP ROUND 1 SCHEDULE pic.twitter.com/XMhoQxDEAt
— Umer Farooq (@UmerFar68402980) October 10, 2022
ICC MEN’S T20 WORLD CUP 2022 🏆
Super 12 – Schedule #WT20 #cricket #T20WorldCup2022#T20WorldCup2022 #pakistancricket #cricketchallenge #Cricket pic.twitter.com/tydKGw2ExW— Mohsin Rehan (@MohsinR91648397) October 11, 2022