ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండు సార్లు పతకాలు అందించిన స్టార్ రెజ్లర్ సుశీల్‌కుమార్‌పై హత్య, హత్యాయత్నం, దౌర్జన్యం వంటి అభియోగాలు నమోదు అయ్యాయి. జూనియర్ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో బుధవారం ఢిల్లీ కోర్టు ఈ అభియోగాలను సుశీల్‌పై నమోదు చేసింది. దీంతో సుశీల్‌ను దేశంలోనే అత్యంత దుర్భేద్యమైన తీహార్ జైలుకు తరలించారు. సుశీల్‌తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 17పై కూడా అభియోగాలు మోపారు. అందులో ఇద్దరు పరారీలో ఉండగా వారిని కూడా ఈ జాబితాలో చేర్చింది కోర్టు. సుశీల్ కుమార్ 2008, 2012 ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు అందించాడు.
కాగా.. ఢిల్లీలోని ఛత్రపాల్ స్టేడియం వద్ద గత ఏడాది మే 4న యువ రెజ్లర్ సాగర్ రాణాపై సుశీల్‌కుమార్ తన స్నేహితులతో కలిసి దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సాగర్‌తో పాటు అతని స్నేహితులు సోను, అమిత్‌కుమార్‌లపై కూడా సుశీల్ అతని స్నేహితులు దాడి చేసినట్లు తెలుస్తుంది. ఈ దాడిలో సాగర్ రాణా తీవ్ర గాయాలపాలై.. ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మరణించాడు. దాడి అనంతరం పరారీలో ఉన్న సుశీల్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిలో పాటు అతని స్నేహితుడు అజయ్ కుమార్‌ను కూడా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వీరిద్దరూ బెయిల్ కోసం అప్లై చేసుకోగా.. కోర్టు వీరి బెయిల్ అభ్యర్థనను తిరస్కరించింది.
ఒక ప్లాట్ విషయంలో సుశీల్‌కుమార్, సాగర్ రాణా మధ్య వివాదం చెలరేగినట్లు.. ఆ నేపథ్యంలో చేసిన దాడి.. ఈ హత్యకు దారితీసినట్లు పోలీసులు విచారణలో తేల్చారు. సుశీల్‌పై వచ్చిన హత్య ఆరోపణలు అతని కెరీర్‌ను నాశనం చేశాయి. ఇప్పటికే భారత రెజ్లింగ్ సమాఖ్య సుశీల్ కుమార్ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. అతనితో పాటు అతనికి సహకరించిన పూజా ధండాను కూడా కాంట్రాక్ట్‌ను తొలగించింది. మూడేళ్ల క్రితమే వీరికి సెంట్రల్ కాంట్రాక్టులు దక్కాయి. అలాగే సుశీల్‌ను రైల్వే శాఖ సస్పెండ్ చేసింది. నార్తర్న్ రైల్వేస్‌లో సీనియర్ కమర్షియల్ మేనేజర్‌గా పని చేస్తున్న సుశీల్‌ను విధులను తప్పించింది.
#BREAKING | Olympian Sushil Kumar charged with murder in case of junior wrestler’s death https://t.co/YftStET0rA pic.twitter.com/KqXxrB4fCU
— NDTV (@ndtv) October 12, 2022
ఇది కూడా చదవండి: కేరళ నరబలి! శవాలని ఉడకపెట్టి తినేశారు! మొత్తం స్టోరీ!