ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌ను అధిగమించి రెండో ర్యాంక్(801 పాయింట్లు)కు చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో కేవలం 36 బంతుల్లో 69 పరుగులతో రాణించిన సూర్య.. తన ర్యాంకు మెరుగుపర్చుకున్నాడు. ఇక మిగిలింది అగ్రస్థానమే. ప్రస్తుతం ఈ స్థానంలో పాకిస్తాన్ ఆటగాడు మహమ్మద్ రిజ్వాన్(861 పాయింట్లు) కొనసాగుతున్నాడు.
ఏడాది క్రితం జట్టులో స్తానం కోసం పోరాడిన సూర్య.. ఇప్పుడు మ్యాచ్ ఫలితమే తన చేతుల్లో ఉండే స్థాయికి ఎదిగిపోయాడు. క్రీజులో కుదురుకుంటే ఎంతటి మ్యాచ్ అయినా వన్ సైడ్ చేసేస్తున్నాడు. తాజాగా, ఉప్పల్ వేదికగా జరిగిన సిరీస్ డిసైడర్ మ్యాచే అందుకు ఉదాహరణ. కొండంత లక్ష్యం ముందున్నా.. ఏ మాత్రం ఎదురు బెదురు లేకుండా పని కానిచ్చేశాడు. ఆసీస్‌తో జరిగిన మూడో టీ20లో కీలక సమయంలో బ్యాటింగ్ కు వచ్చిన సూర్య.. వచ్చీ రాగానే హిట్టింగ్ మొదలెట్టకుండా కాసేపు జాగ్రత్తగానే ఆడాడు. కాస్త కుదురుకున్నాక ఆసీస్ బౌలర్లకు తన మాస్టర్ క్లాస్ షాట్ల రుచి చూపించాడు. సూర్య క్రీజులో ఉన్నంత సేపు ఆసీస్ బౌలర్లు ఏ బాల్ వేయాలో అర్థం కాని పరిస్థితి కన్పించింది. ఆఖర్లో ఔటయినప్పటికీ.. ఛేజింగ్‌కు అనువైన స్కోరును కలిగి ఉండేలా చేశాడు.
Suryakumar Yadav Moved to No 2 spot In ICC Men’s T20I Batting Rankings.. pic.twitter.com/0riDM1uQUF
— Govardhan Reddy (@gova3555) September 28, 2022
ఇక, టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ ఒక స్థానం మెరుగుపరుచుకొని 15వ స్థానానికి చేరగా, టీమిండియా ప్రస్తుత సారధి రోహిత్ శర్మ 13వ స్థానంలో నిలిచాడు. ఇక టీ20 బౌలర్ ర్యాంకింగ్స్‌లో భువనేశ్వర్ ఒక్కడే టాప్-10లో ఉండగా, ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా 5వ స్థానంలో ఉన్నాడు. ఇక, టీం ర్యాంకింగ్స్‌లో భారత జట్టు టీ20ల్లో అగ్రస్థానంలో ఉండగా, వన్డేల్లో 3, టెస్టుల్లో 2వ స్థానంలో కొనసాగుతోంది.
కాగా, భారత జట్టు స్వదేశంలో సౌతాఫ్రికాతో తలపడనున్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఈ సిరీస్ లో సూర్య నిలకడగా రాణిస్తే అగ్రస్థానానికి చేరుకోవడం లాంఛనమే. ఈ సిరీస్ లో భారత జట్టు, సౌతాఫ్రికాతో మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది.
– Mohammad Rizwan retained his place as No.1 T20I batter in ICC Men’s T20I batter rankings.
– Suryakumar Yadav climbs to No.2 position in ICC Men’s T20I batter rankings.#ICCRankings pic.twitter.com/GtP6t2Z54a
— CricTracker (@Cricketracker) September 28, 2022