మరికొన్ని రోజుల్లో పొట్టి ప్రపంచ కప్ సంగ్రామం ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ గెలుపే లక్ష్యంగా టీమిండియా ఇప్పటికే ఆసీస్ గడ్డపై ప్రాక్టీస్ మొదలెట్టింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో ప్రధాన వార్మప్ మ్యాచ్‌లకు ముందు వెస్టర్న్ ఆస్ట్రేలియాతో జట్టుతో టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. భీకర ఫామ్‌లో ఉన్న మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లోనూ తన ఫామ్ కొనసాగించాడు. 35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 52 పరుగులు చేసి రాణించాడు. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం 20 బంతుల్లో 29 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.
కాగా.. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ విఫలం అయింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, రిషభ్ పంత్ వచ్చారు. ఈ మ్యాచ్ కేఎల్ రాహుల్ స్థానంలో పంత్‌ను ఆడించారు. అలాగే దీపక్ హుడాను సైతం అప్‌ది ఆర్డర్ పంపించారు. కాగా.. పంత్ కొంత కాలంగా సరైన ఫామ్‌లో లేని కారణంగా అతన్ని బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు పంపించి.. పరుగులు చేయించాలని కెప్టెన్ రోహిత్ శర్మ పంత్‌ను ఓపెనర్‌గా దింపాడు. కానీ పంత్ మాత్రం మరోసారి విఫలం అయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన దీపక్ హుడా సైతం విఫలం అయ్యాడు. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలకు విశ్రాంతి ఇచ్చారు. ఇక బౌలింగ్‌లో టీమిండియా బౌలర్లు సైతం చెలరేగుతున్నారు. కేవలం 12 పరుగులకే 4 వికెట్లు కూల్చారు. భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్ రెండేసి వికెట్లు తీసుకున్నారు.
Innings Break!#TeamIndia post a total of 158/6
Suryakumar Yadav 52 off 35 (3×4, 3×6)
Hardik Pandya 29 off 20 pic.twitter.com/ghN3R0coqr— BCCI (@BCCI) October 10, 2022