సౌతాఫ్రికాతో గౌహతీ వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ప్రొటీస్ బౌలర్లను టీమిండియా బ్యాటర్లు పొట్టుపొట్టు కొట్టి 237 పరుగుల భారీ స్కోర్‌ను సాధించారు. ఓపెనర్ కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలో రాణించారు. వీరితో పాటు రోహిత్ శర్మ(43), విరాట్ కోహ్లీ(49 నాటౌట్), దినేష్ కార్తీక్(7 బంతుల్లో 17 నాటౌట్) భారీ స్కోర్‌లో తమ వంతు పాత్ర పోషించారు. భారీ స్కోర్‌ను ఛేదించే క్రమంలో సౌతాఫ్రికా కూడా ధీటుగానే బదులిచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసి విజయానికి 16 పరుగుల దూరంలో నిలిచి పోరాడి ఓడింది. కాగా.. మ్యాచ్ అనంతరం 28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 57 పరుగులు చేసిన కేఎల్ రాహుల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును బహూకరించారు.
ఈ విషయంపై సూర్యకుమార్ యాదవ్ అభిమానులు మండిపడుతున్నారు. 28 బంతుల్లో 57 పరుగులు చేసిన ప్లేయర్‌కు అవార్డు ఇస్తే.. మరీ 22 బంతుల్లోనే 61 పరుగులతో అదరగొట్టిన సూర్యకుమార్ యాదవ్‌కు అవార్డు ఎందుకు ఇవ్వలేదని.. అసలు ఏం కారణంతో సూర్యను కాదని రాహుల్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ బంతులు ఆడి.. ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిని కాదని.. అతని కంటే ఎక్కువ బంతులు ఆడి తక్కువ పరుగులు చేసిన ప్లేయర్‌కు ఎలా బెస్ట్ పెర్మామెన్స్ అవార్డు ఇస్తారో తమకు అర్థం కావడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. పైగా మిడిల్ ఓవర్స్‌లో వచ్చి 277 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం అంత సులవైన విషయం కాదని అంటున్నారు.
బాల్స్ పరంగా, స్కోర్ పరంగా, స్ట్రైక్ రేట్ పరంగా, సిక్సుల పరంగా, సిచ్యూవేషన్ పరంగా ఎలా చూసుకున్నా.. సూర్యకుమార్ ఇన్నింగ్స్ బెస్ట్‌గా నిలుస్తుందని అంటున్నారు. కాగా.. కేఎల్ రాహుల్ అభిమానులు మాత్రం రాహుల్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించడాన్ని సమర్ధిస్తున్నారు. కానీ.. ఎక్కువ శాతం మంది క్రికెట్ అభిమానుల నుంచి సూర్యకుమార్ యాదవ్‌కు కాకుండా కేఎల్ రాహుల్‌కు ఈ అవార్డు లభించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా.. చాలా రోజులుగా కేఎల్ రాహుల్ తక్కువ స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి. కానీ.. ఈ మ్యాచ్‌లో రాహుల్ 203 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేశాడు.
Player of the match #KLRahul𓃵
vice-captain #KLRahul 🔥#INDvsSA pic.twitter.com/9bb45pQy5u— Bala bhai (@CaptainKLRahul) October 2, 2022
ఇది కూడా చదవండి: రోహిత్ ముక్కులోంచి రక్తం.. ఆందోళనలో ఫ్యాన్స్! అసలేమైందంటే..?