సాధారణంగా క్రికెట్ మ్యాచ్ గానీ లేదా మరేదైనా మ్యాచ్ గానీ వర్షం కారణంగా ఆలస్యం అవ్వటం చూశాం. లేదా రద్దు అవ్వడం చూశాం. కానీ భారత్-విండీస్ ల మధ్య జరిగిన రెండో టీ20 మాత్రం విచిత్రమైన కారణంతో మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభం అయ్యింది. దాంతో ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈక్రమంలో దానికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
సాధారణంగా గల్లీ క్రికెట్ లో ఒకరి వస్తువులు అంటే బ్యాట్ కానీ బాల్ కానీ ఒకరు వాడటం సహజమే. కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అలాంటి ఘటనే ఒకటి తాజాగా విండీస్, భారత్ రెండో టీ20 మ్యాచ్ లో జరిగింది. భారత ఆటగాళ్ల లగేజీ బ్యాగ్ లు స్టేడియానికి రావడం ఆలస్యం అయ్యాయి. లగేజీ ఎలాగో వస్తాయి కదా అని భారత్ బ్యాటింగ్ ఆరంభించడానికి రడీ అయ్యింది.
Jersey on demand😂😅
📸: FanCode pic.twitter.com/o6WcnRimx7
— CricTracker (@Cricketracker) August 1, 2022
కానీ లగేజీ బ్యాగ్ లు రాలేదు. దాంతో భారత ఓపెనర్ సుర్యకుమార్ యాదవ్ తన జెర్సీలో కాకుండా అర్షదీప్ జర్సీ వేసుకుని బ్యాటింగ్ కు దిగాడు. దీంతో చూసిన వారంత అవాక్కయ్యారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే భారత్ ఆలౌట్ అయ్యే వరకు కూడా లగేజీ రాలేదు. దీంతో భారత బౌలర్ అయిన ఆవేశ్ ఖాన్ సైతం అర్షదీప్ జర్సీనే వేసుకుని బ్యాటింగ్ కు వచ్చాడు. అతను అవుట్ అయ్యాక అర్షదీప్ కూడా అదే జెర్సీలో బ్యాటింగ్ కు రావడం గమనార్హం. ప్రస్తుతం ముగ్గురు ఒకే జెర్సీతో ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. దీని పై ఓ నెటిజన్ స్పందిస్తూ.. అర్షదీప్ తన జెర్సీని రీ సేలింగ్ చేస్తున్నాడా. అంటూ సరదాగా కామెంట్స్ చేశాడు. మరి ఒకే జెర్సీని ముగ్గురు ఆటగాళ్లు వేసుకోవడం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
This kit problem is wild. For a moment, I thought Arshdeep was opening before realising SKY is wearing his jersey. 😂
— Manya (@CSKian716) August 1, 2022
ఇదీ చదవండి: తనని తాను గేగా ప్రకటించుకున్న కివీస్ మాజీ క్రికెటర్!
ఇదీ చదవండి: గాయంతోనే రజతాన్ని సాధించిన సుశీలా దేవి! హ్యాట్సాఫ్ అంటూ ప్రశంసలు..