టీ20 వరల్డ్ కప్ కోసం గత నెల బీసీసీఐ ప్రకటించిన భారత్ జట్టులో సూర్యకుమార్ యాదవ్‌కు చోటు దక్కింది. కచ్చితంగా టీమిండియాకు సూర్యకుమార్ కీ ప్లేయర్ అవుతాడు అని ఆసమయంలో అందరు భావించారు. అంతకు ముందు అతని ప్రదర్శనను పరిగణంలోకి తీసుకుని అతనికి టీమిండియాలో చోటిచ్చారు. సూర్యకుమార్‌ను తీసుకోవడంపై సెలెక్టర్ల ఎంపికను కూడా అందరు ప్రశంసించారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2021 రెండో దశలో మాత్రం సూర్యకుమార్ ఘోరంగా విఫలమవుతున్నాడు. అతను ఆడిన చివరి 5 మ్యాచ్‌లలో అతను చేసిన పరుగులు 3,3,5,8,0. ఈ గణాంకాలు చూస్తే వచ్చే నెలలో జరిగే టీ20 వరల్డ్ కప్‌కు సూర్యకుమార్ భారత్‌కు భారమే తప్ప జట్టుకు ఉపయోగం ఉండదు.
వరుసగా ఐదు మ్యాచ్‌లలో ఇంత దారుణంగా విఫలమైన ఆటగాడిని వరల్డ్ కప్ జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్ పెరుగుతుంది. పలువురు మాజీ క్రికెటర్లు ఇప్పటికే సూర్యకుమార్ ఫామ్‌పై విమర్శలు చేస్తున్నారు. ఐపీఎల్ మొదటి దశలో మొదటి 5 మ్యాచ్‌లలో అద్భుతంగా ఆడిన సూర్యకుమార్ ప్రస్తుతం మాత్రం దారుణంగా విఫలం అవుతున్నాడు. ఐపీఎల్‌కు ముందు ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మార్చ్ 14న జరిగిన 2వ టీ20 మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్‌కు ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. తిరిగి కీలకమైన 4వ మ్యాచ్‌లో ఆడిన యాదవ్ 57 పరుగులతో అరగొట్టాడు. చివరి మ్యాచ్‌లో కూడా 32 పరుగులతో రాణించాడు. సూర్యకుమార్ ఆడిన 3 మ్యాచ్‌లలో ఇండియా గెలిచి 5 టీ20ల సిరీస్‌ను 3-2తో గెలుచుకుంది. అనంతరం శ్రీలంకలో పర్యటించిన భారత్ జట్టులో చోటు దక్కించుకుని మొదటి టీ20లోనే 50 పరుగులతో మళ్లీ అదరగొట్టాడు.
ఈ ప్రదర్శనల ఆధారంగా సూర్యకుమార్‌ను అక్టోబర్ 17 నుంచి యూఏఈలో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు ప్రకటించిన భారత జట్టులో బీసీసీఐ స్థానం కల్పించింది. కానీ ప్రస్తుతం ఐపీఎల్‌లో సూర్యకుమార్ ఫామ్ చూస్తే అతని స్థానం ఉంటుందో లేదో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. జట్టులో చోటు దక్కని ఇతర ఆటగాళ్లు మంచి ప్రదర్శన కనబరుస్తుండడం సూర్యకుమార్‌కు మరింత కలవరపెట్టే అంశం. మరీ సూర్యకుమార్ ఫామ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.