కాలం చాలా విచిత్రమైంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరం ఊహించలేం. జీరో అనుకున్న వాళ్లు.. రాత్రికి రాత్రే స్టార్లు అవుతుంటారు. స్టార్లు అనుకున్న వాళ్లు పాతాళానికి పడిపోతుంటారు. సరిగ్గా ఈ రెండు మాటలు సీనియర్ ఆటగాడు సురేష్ రైనాకు సరిపోతాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో సురైష్ రైనా ఒకరనడంలో ఎలాంటి సందేహం లేదు.. బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించడమే కాకుండా.. ఫీల్డింగ్ లో విన్యాసాలు చేయగల సమర్థుడు. ఎంత కష్టమైన క్యాచ్ అయినా సరే.. అది రైనా వైపు వచ్చిందంటే.. ఆ బ్యాటర్ ఆశలు వదులుకోవాల్సిందే. ఇక ఐపీఎల్ లో రైనా గురుంచి చెప్పుకోవాలంటే.. చెన్నై సూపర్ కింగ్స్ ని ఛాంపియన్స్ గా నిలబెట్టడంలో అతని బాధ్యత మరవలేనిది. అలాంటి సురేష్ రైనా ఇవాళ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు.
లీగ్ చరిత్రలోనే ‘మిస్టర్ ఐపీఎల్’ గా పేరొందిన సురేష్ రైనా అనూహ్యంగా ఐపీఎల్ 2022 మెగా వేలంలో అమ్ముడుపోలేదు. దీంతో లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకడైనా రైనాకు ఇలాంటి రోజు రావడంతో బాధపడని క్రికెట్ అభిమాని లేరు. అయితే.. గుజరాత్ టైటాన్స్ జట్టు సభ్యుడు జాసన్ రాయ్ బయో బబుల్ లో గడపటం ఇష్టం లేక టోర్నీనుంచి నిష్క్రమించాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ జట్టు సురేష్ రైనాపై ఆసక్తి కనపరుస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే.. సురేష్ రైనా తన ఫిట్‌నెస్ కసరత్తులను మొదలుపెట్టేశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను రైనా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో రైనా సైక్లింగ్ చేయడం, జిమ్‌లో ఎంత కఠినంగా శ్రమిస్తున్నాడో స్పష్టంగా కనిపిస్తోంది. తీవ్రమైన వ్యాయామ సెషన్‌తో వారాన్ని ముగించడం కంటే మెరుగైనది ఏమి లేదంటూ దీనికి క్యాప్షన్ పెట్టాడు రైనా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇదేదో ఐపీఎల్2022 మెగా వేలానికి ముందే చేసి ఉంటే బాగుండేదేమోనని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఐపీఎల్ మెగా వేలంలో 2 కోట్ల రూపాయల బేస్ ప్రైజ్‌తో బరిలోకి దిగిన సురేష్ రైనాను ఏ జట్టు కొనుగోలు చేయని సంగతి తెలిసిందే. అతని పాత జట్టు సీఎస్కే సైతం రైనాను పట్టించుకోకపోవడం అభిమానులకు మింగుడు పడలేదని చెప్పుకోవాలి.
Gujarat Titan replaced Jason Roy by Suresh Raina for IPL2022. 😍
It was a very happy moment for Suresh Raina fans.
We are very happy to see you again in Gujarat.
Previously, he was the captain of #Gujaratlions#GujaratTitans #SureshRaina𓃵 @gujarat_titans pic.twitter.com/gErKoS65wi— yashwanth gowda (@yashwanthkl) March 3, 2022