టీమిండియా సెలక్టర్లపై, వారి సెలెక్షన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్. గత కొంతకాలంగా రంజీ ట్రోఫీలో పరుగుల వరద పారిస్తున్న క్రికెటర్ల వైపు ఎందుకు చూడటం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా రంజీ ట్రోఫీలో పరుగుల వరద పారిస్తూ.. రికార్డులు కొల్లగొడుతున్న సర్ఫరాజ్ ఖాన్ ను ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశాడు. అయితే సెలక్టర్లు సర్ఫరాజ్ ఎంపిక విషయంలో అతడి శరీర ఆకృతిని పరిగణంలోకి తీసుకుంటున్నారని, మీకు స్లిమ్ గా ఉన్న వాళ్లు కావాలి అనుకుంటే.. ఫ్యాషన్ షోకి వెళ్లి మోడల్స్ కు బ్యాట్, బాల్ ఇచ్చి వారిని జట్టులోకి తీసుకోండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లో వెళితే..
సర్ఫరాజ్ ఖాన్.. దేశవాలీ క్రికెట్ లో మారుమ్రోగిపోతున్న పేరు. రంజీ ట్రోఫీలో పరుగుల వరద పారిస్తూ.. సెలెక్టర్లకు సవాల్ విసురుతున్నాడు. మీరె సెలెక్ట్ చేయకపోయినా నా పరుగుల ప్రవాహం ఆగదు అన్నట్లుగా సెంచరీల మీద సెంచరీలు కొడుతున్నాడు. దాంతో అతడికి ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో ప్లేస్ ఖాయం అనుకున్నారు అందరు. కానీ సర్ఫరాజ్ కు మళ్లీ నిరాశే ఎదురైంది. ఇక సర్పరాజ్ ను టెస్ట్ సిరీస్ కు ఎంపిక చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. టీమిండియా సెలెక్షన్ కమిటీపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్. సెలెక్టర్లు ఆటగాళ్ల శరీర ఆకారాన్ని బట్టి కాకుండా.. వారి ఫామ్ ను బట్లి ఎంపిక చేయాలని సూచించాడు.
అదీకాక మీకు స్లిమ్ గా ఉన్న వారే కావాలి అనుకుంటే.. ఫ్యాషన్ షోకి వెళ్లి కొంతమంది మోడల్స్ ని ఎంపిక చేసుకుని వారికి బ్యాట్, బాల్ ఇచ్చి జట్టులోకి తెచ్చుకోండి అంటూ ఎద్దేవచేశాడు. ఇకపోతే.. క్రికెటర్లకు ఫిట్ నెస్ చాలా ముఖ్యం నేను కాదనను. కానీ కంటిన్యూస్ గా సెంచరీలు సాధించే ఆటగాడు ఫిట్ నెస్ లో ఉన్నట్లే లెక్క. అతడికి యో-యో టెస్ట్ ప్రామాణికం కాదు. ఇప్పటికైనా సెలెక్టర్లు క్రికెటర్ల ఆకారాన్ని చూడకుండా.. వారి ఆటను చూసి సెలక్ట్ చేయండి అని గవాస్కర్ సూచించాడు. ప్రస్తుతం గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మరి సెలెక్షన్ కమిటీపై గవాస్కర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.