ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అద్భుత ఫామ్‌లో ఉండి.. నంబర్ వన్ బ్యాటర్‌గా కీర్తించబడుతున్న బాబర్ అజమ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చాడు శ్రీలంక బౌలర్ ప్రభాత్ జయసూర్య. పాక్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టులో 342 పరుగుల టార్గెట్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్‌ను షఫీక్ అబ్దుల్లా, బాబర్ ఆజం తమ ఇన్నింగ్స్‌తో నిలబెట్టారు. అటు షఫీక్ సెంచరీతో ఆకట్టుకోగా.. బాబర్ ఆజం కూడా అర్థ సెంచరీ సాధించాడు.
ఈ జోడిని విడదీయడానికి లంక బౌలర్లు చాలా రకాలుగా ప్రయత్నించారు. చివరికి ప్రభాత్ జయసూర్య అద్భుత బంతితో బాబర్‌ను బోల్తాకొట్టించాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన ప్రభాత్ జయసూర్య ఓవర్ ది వికెట్ మీదుగా బౌలింగ్ చేశాడు. పూర్తిగా లెగ్‌స్టంప్ అవతల పడిన బంతిని బాబర్ అంచనా వేయడంలో విఫలం అయ్యాడు. లెగ్ స్టంప్ మీదుగా పడిన బంతి ఆఫ్‌స్టంప్ మీదుగా వస్తుందని భ్రమ పడిన బాబర్ ప్యాడ్లను అడ్డుపెట్టాడు. కానీ లెగ్‌స్టంప్ అవతల పడిన బంతి బాబర్ కాళ్ల వెనకాల నుంచి టర్న్ తీసుకొని నేరుగా లెగ్‌స్టంప్‌ను ఎగురగొట్టింది.
అంతే అసలేం జరిగిందో అర్థం కాక బాబర్ కొద్ది సేపు అలానే క్రీజ్‌లో నిలబడిపోయాడు. లంక ఆటగాళ్లు మాత్రం సంబురాల్లో మునిగిపోయారు. బాబర్ అవుట్ అయిన విధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాంటి బాల్ వేస్తే.. తోపు బ్యాటర్‌గా పిలుస్తున్న బాబర్ అజమ్ కూడా జూజుబీనే అంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కాగా ఇదే మ్యాచ్‌లో పాక్ బౌలర్ యాసిర్ షా ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’ని గుర్తు చేసే డెలవరీ వేసిన విషయం తెలిసిందే. ఒక రోజు తేడాతో ఇదే మ్యాచ్‌లో మరో అద్భుత డెలవరీ పడింది. మరి బాబర్ అజమ్ అవుట్ అయిన విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Babar azam is bowled out tor
55 (104)#PAKvSL pic.twitter.com/cVwN8EQ8uT— CricMadcap (@CricMadcap) July 19, 2022