ఐపీఎల్ 2022 సీజన్‌ని ఎన్నో ఆశలతో ఆరంభించిన రవీంద్ర జడేజా.. ఘోర పరాభవం, అవమానాలతో సీజన్ మధ్యలో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో వచ్చే సీజన్‌లో కొత్త టీమ్‌కి ఆడబోతున్నాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇందుకు ఓ కారణం ఉందండోయ్! వెస్టిండీస్ పర్యటనలో ఉన్న రవీంద్ర జడేజానే స్వయంగా హింట్ ఇచ్చాడు.
జడ్డూ ట్వీట్ వల్లే!
ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న రవీంద్ర జడేజా.. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ నిలకడగా రాణిస్తున్నాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ తో వన్డే సిరీస్ ముగిశాక ‘టీమిండియా జెర్సీలు ధరించిన ఫోటోల’ను ట్విట్టర్ ఓ పోస్టు చేశాడు.. జడేజా. వాటికి ‘బ్లూ అడిక్షన్’ అంటూ చిన్న వ్యాఖ్య జత చేశాడు. దాంతో అతడు ముంబయి ఇండియన్స్‌లో చేరుతున్నాడన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. పరోక్షంగా హింట్ ఇచ్చాడంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Blue addiction🇮🇳 pic.twitter.com/15tfORSKrh
— Ravindrasinh jadeja (@imjadeja) July 23, 2022
జడేజాను అవమానపరిచిన చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందు ఎమ్మెస్ ధోనీ సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో జడేజాకి కెప్టెన్సీ అప్పగించింది చెన్నై ఫ్రాంఛైజీ. అయితే కీ ప్లేయర్లు గాయం కారణంగా తప్పుకోవడంతో ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుస పరాజయాలను అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్. కెప్టెన్సీ ప్రెషర్‌తో రవీంద్ర జడేజా.. అటు బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో ఆఖరికి ఫీల్డింగ్‌లో కూడా ధారుణంగా విఫలమయ్యాడు. పేరుకి జడేజా కెప్టెన్ అయినా ఫీల్డింగ్ మార్పుల దగ్గర్నుంచి, బౌలింగ్ మార్పుల దాకా అన్నింటినీ ధోనీయే దగ్గరుండి చూసుకునేవాడు. జడేజా కేవలం నామమాత్రపు కెప్టెన్‌గా ఉండేవాడు.
8 మ్యాచుల్లో రెండు విజయాలు, 6 పరాజయాలు అందుకున్న తర్వాత సీఎస్‌కే కెప్టెన్సీలో మార్పులు చేసింది మేనేజ్‌మెంట్. జడేజా స్వచ్ఛందంగా కెప్టెన్సీ వదులుకున్నాడని, ఆ బాధ్యతలను తిరిగి ధోనీయే నిర్వహించబోతున్నాడని ప్రకటించింది. అయితే జడేజా కెప్టెన్సీ నుంచి తప్పుకోలేదని, టీమ్ మేనేజ్‌మెంట్ అతన్ని కావాలని తప్పించిందని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత జడేజా కెప్టెన్సీ గురించి ధోనీ చులకనగా వ్యాఖ్యలు చేయడంతో జడ్డూ మరింత ఫీల్ అయ్యాడని ప్రచారం జరిగింది.
సీజన్ మధ్యలోనే గాయం వంకతో రవీంద్ర జడేజా తప్పుకోవడంతో ఈ వార్తలకు మరింత ఊతం ఇచ్చినట్టైంది. అయితే సీఎస్‌కే మేనేజ్‌మెంట్ మాత్రం జడేజాతో ఎలాంటి విభేదాలు లేవని, అతను వచ్చే సీజన్‌లో ప్లేయర్‌గా టీమ్‌లో ఉంటాడని ప్రకటించింది. అయితే.. జడేజా, తన ఇన్‌స్ట్రాగ్రామ్ నుంచి సీఎస్‌కేకు సంబంధించిన పోస్టులన్నింటికీ డిలీట్ చేశాడు. దీంతో వచ్చే సీజన్‌లో జడ్డూ, సీఎస్‌కేకు ఆడడం అనుమానమే అంటున్నారు అభిమానులు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
📢 Official Announcement:
Jadeja will be missing the rest of the IPL due to injury. Wishing our Jaadugar a speedy recovery! @imjadeja
— Chennai Super Kings (@ChennaiIPL) May 11, 2022
ఇదీ చదవండి: Virat Kohli: బేర్ గ్రిల్స్‌తో కోహ్లీ షో.. అభిమానులకి విరాట్ పర్వమే..
ఇదీ చదవండి: సూర్యకుమార్ కెరీర్‌ను నాశనం చెయొద్దు! రోహిత్‌కు భారత మాజీ క్రికెటర్ రిక్వెస్ట్