Virat Kohli: ఒకప్పుడు మైదానంలో అడుగుపెడితే బంతి కనబడేది కాదు. రాటుతేలిన పెర్ఫార్మెన్స్‌తో సిక్సులు, ఫోర్లు కొడుతూ బౌలర్లని ఒక ఆట ఆడుకున్నారు విరాట్ కోహ్లీ. అయితే రెండున్నరేళ్ళుగా సెంచరీ మార్కు అందుకోలేక చాలా ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో ఆయన ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ తర్వాత వెస్టిండీస్ పర్యటనకు దూరంగా ఉన్నారు. వన్డేతో పాటు టీ20 సిరీస్ నుంచి కూడా రెస్ట్ కావాలని బీసీసీఐని కోహ్లీ కోరినట్లు వార్తలు వచ్చాయి. ఈ విరామ సమయంలో కోహ్లీ.. తన చిన్ననాటి కోచ్ అయిన రాజ్‌కుమర్ శర్మ అకాడమీకి వెళ్ళబోతున్నారని, బేసిక్స్ నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఫామ్‌లోకి వచ్చేందుకు ప్రాక్టీస్ చేసేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వచ్చాయి. ఇంగ్లాండ్ టూర్ ముగించుకున్న భారత జట్టు.. వెస్టిండీస్ పర్యటనలో వన్డే సిరీస్ ముగించి.. టీ20 సిరీస్ మొదలెట్టినా.. కోహ్లీ మాత్రం సతీమణి అనుష్క శర్మతో కలిసి ఇంకా లండన్ వీధుల్లో తిరుగుతున్నారు. అయితే తాజాగా విరాట్ కోహ్లీ ఈ గ్యాప్‌లో ఒక షో చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. డిస్కవరీ ఛానెల్‌లో వింత వింత అడ్వెంచర్లు చేసే బేర్ గ్రిల్స్ ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ షోలో కోహ్లీ పాల్గొనబోతున్నారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అడవుల్లో, కొండల్లో తిరుగుతూ దొరికిన పాములని, ఎలుకలను కాల్చుకుని తినే బేర్ గ్రిల్స్ షోకి ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులారిటీ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్, విక్కీ కౌశల్, రణ్‌వీర్ సింగ్ సూపర్ ప్టార్ రజనీ కాంత్ వంటి హీరోలతో కూడా స్పెషల్ ఎపిసోడ్స్ చేశారు. "A true heart of a lion and kind spirit" - Bear Grylls wants Virat Kohli to appear on Man vs. Wild https://t.co/GbswbaxIAJ — Sport Tweets (@TweetsOfSportUK) August 1, 2022 తాజాగా బేర్ గ్రిల్స్.. 'విరాట్ కోహ్లీతో సాహసం చేస్తే అద్భుతంగా ఉంటుంది. అతని మనసు సింహం లాంటిది’ అంటూ కామెంట్ చేశారు. దీంతో త్వరలో విరాట్ కోహ్లీ, బేర్ గ్రిల్స్ షోలో ప్రత్యక్షం కాబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇటు బేర్ గ్రిల్‌కి కూడా ప్రపంచవ్యాప్తంగా పేరుంది. ఈ ఇద్దరూ కలిసి షో చేస్తే బుల్లితెర రికార్డులు బద్దలే అని, విరాట్ పర్వం మొదలవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి విరాట్ కోహ్లీ, బేర్ గ్రిల్స్ షో చేస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: India vs Pakistan: అదరగొట్టిన హర్మన్ ప్రీత్ కౌర్.. ధోని రికార్డు బద్దలు! ఇది కూడా చదవండి: Sourav Ganguly: గంగూలీ అభిమానులకు గుడ్‌న్యూస్! మళ్లీ గ్రౌండ్‌లోకి దిగనున్న దాదా