ప్రత్యక్షంగా స్టేడియంలో మ్యాచ్ చూస్తుంటే కలిగే అనుభూతి వేరు. అందులోనూ టీ20 మ్యాచ్ అంటేనే నరాలు తెగే ఉత్కంఠ, ప్రతిక్షణం ఉద్వేగం నెలకొంటుంది. అలాంటి వేళ ఏకంగా గ్రౌండ్‌లోకి పాము రావడం కలకలం రేపింది. స్దానిక బర్సపర స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికాల మధ్య రెండో టీ20 మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా అభిమానులను, క్రికెటర్లు షాకయ్యారు. అయితే.. ముందుగానే పామును కనిపెట్టడం వల్ల ఆటగాళ్లకు ప్రమాదం తప్పినట్టైంది.
గుహవటి వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టీ20లో ఈ ఘటన చోటు చేసుకుంది. భారత ఇన్నింగ్స్‌లో ఏడో ఓవర్ పూర్తయి ఎనిమిదో ఓవర్ మొదలు కాబోతున్న సమయంలో ఓ పాము జరజరా పాకుతూ మైదానంలోకి వచ్చేసింది. దీంతో ఆటను ఆపేసి క్రికెటర్లలంతా ఆ పాము వైపే చూస్తుండిపోయారు. అభిమానులకు కూడా ఏం జరిగిందో వెంటనే అర్థం కాలేదు. దీంతో హుటాహుటిన గ్రౌండ్ సిబ్బంది కర్రలు, బకెట్‌తో అక్కడికి చేరుకుని పామును పట్టి బయటకు తీసుకెళ్లిపోయారు. మైదానంలోకి కుక్కలు, పక్షులు రావడం సాధారణమే కానీ.. ఇలా పాము రావడం ఇదే మొదటిసారేమో. ఈ మ్యాచ్‌లో భారత్ 16 పరుగుల తేడాతో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలిఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.
Snake also reached to watch the cricket match of India and South Africa at the stadium in Guwahati.#Guwahati #Cricket #snake #SnakeAtTheStadium #INDvsSA #INDvsSAT20I pic.twitter.com/cI4cP7FRy7
— Prateek Pratap Singh (@PrateekPratap5) October 2, 2022