సౌతాఫ్రికాతో ఆదివారం గౌహతీలో జరిగిన రెండో టీ20లో టీమిండియా విజయం సాధించింది. 16 పరుగుల తేడాతో గెలిచిన భారత్.. 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. సౌతాఫ్రికాపై టీమిండియాకు స్వదేశంలో ఇదే తొలి టీ20 సిరీస్ విజయం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్ మంచి ఆరంభాన్ని అందించారు. 43 పరుగులు చేసి మంచి జోష్‌లో కనిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. చాలా కాలంగా స్లోగా బ్యాటింగ్ చేస్తున్నాడంటూ విమర్శలు ఎదుర్కొన్న కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ 170పైగా స్ట్రైక్ రేట్‌తో హాఫ్ సెంచరీ సాధించాడు. 28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 57 పరుగులు చేసి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు.
ఇక్కడి నుంచి సూర్యకుమార్ హవా మొదలైంది. సూర్య-కోహ్లీ జోడి టీమిండియా బ్రహ్మాండమైన భాగస్వామ్యాన్ని అందించింది. 22 బంతుల్లోనే 5 ఫోర్లు , 5 సిక్సులతో సూర్యకుమార్ యాదవ్ 61 పరుగులతో దుమ్మురేపాడు. కోహ్లీ కూడా 28 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 49 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చివర్లో దినేష్ కార్తీక్ సైతం 7 బంతుల్లో 17 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. దీంతో సౌతాఫ్రికా ముందు భారత్ 237 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సౌతాఫ్రికా ఆదిలో తడబడింది. కానీ.. మిల్లర్ సెంచరీతో చెలరేగడంతో గట్టి ఫైట్ బ్యాక్ చేసింది. భారీ టార్గెట్‌కు కేవలం 16 పరుగుల దూరం నిలిచి.. దాదాపు గెలిచినంత పని చేసింది. కాగా.. మ్యాచ్ చివర్లో అంపైర్ ఇచ్చిన తప్పుడు నిర్ణయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రియాక్ట్ తీరు చర్చనీయాంశంగా మారింది.
77 పరుగుల వద్ద మిల్లర్ స్ట్రైక్‌లో ఉన్న సమయంలో అర్షదీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్ మూడో బంతి వైడ్ లైన్ దాటి పడింది. కానీ.. బ్యాటర్ కూడా బాల్‌ను వెంటాడు పక్కకు జరిగినా.. అంపైర్ దాన్ని వైడ్‌గా ప్రకటించాడు. దీంతో బౌలర్ అర్షదీప్ షాక్ అవుతూ.. తన కెప్టెన్ రోహిత్ శర్మ వైపు చూడటంతో.. రోహిత్ అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దాన్ని ఎలా వైడ్ ఇస్తావంటూ అంపైర్ వద్దకు దూసుకు వస్తుండటంతో అంపైర్ రోహిత్‌కు ఎదురెళ్లి వైడ్ ఇవ్వడానికి కారణం వివరించాడు. చాలా కోపంగా అక్కడి వచ్చిన రోహిత్‌కు అంపైర్ చెప్పిన సమాధానం నవ్వుతెప్పించినట్లు ఉంది.. అందుకే అంపైర్-రోహిత్ నవ్వుతూ ఎవరి స్థానాలకు వారు వెళ్లిపోయారు. కాగా.. రోహిత్ ఆవేశంగా అంపైర్‌పైకి దూసుకొచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
— Hardin (@hardintessa143) October 3, 2022
ఇది కూడా చదవండి: సూర్యకుమార్‌ను ఇకపై ఆడించాలనుకోవడం లేదు! రోహిత్ సంచలన స్టేట్‌మెంట్