సౌతాఫ్రికాతో గౌహతీ వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20లో మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 22 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సులతో ప్రొటీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 61 పరుగులు చేసి చిన్న పొరపాటుతో రనౌట్ అయ్యాడు కానీ.. లేదంటే సెంచరీ చేసే ఊపులో కనిపించాడు. తొలుత ఓపెనర్లు కేఎల్ రాహుల్-రోహిత్ శర్మ ఇచ్చిన అద్భుత స్టార్ట్‌ను ఉపయోగించుకున్న సూర్యకుమార్-కోహ్లీ జోడీ టీమిండియా భారీ దిశగా నడిపించింది. చివర్లో ది ఫినిషర్ దినేష్ కార్తీక్ కూడా 7 బంతుల్లో 17 పరుగులతో దడదడలాడించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ టార్గెట్‌ను సౌతాఫ్రికా ముందు ఉంచింది.
ఈ టార్గెట్ ఛేజ్‌ను స్లోగా ఆరంభించిన సౌతాఫ్రికా సగం ఓవర్లు ముగిసిన తర్వాత స్పీడ్ పెంచినా ఉపయోగం లేకుండా పోయింది. డేవిడ్ మిల్లర్ సెంచరీతో చెలరేగినా ప్రొటీస్‌ను గెలిపించలేకపోయాడు. దీంతో సౌతాఫ్రికా గట్టి పోరాటం చేసి నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసి కేవలం 16 పరుగుల తేడాతో ఓడింది. మ్యాచ్ తర్వాత విన్నింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ సూర్యకుమార్ యాదవ్ ఆడిన తీరును మెచ్చుకున్నాడు. ఇకపై సూర్యకుమార్‌ను ఆడించాలని అనుకోవడం లేదని, అతన్ని నేరుగా అక్టోబర్ 23వ తేదీన బరిలోకి దింపాలని భావిస్తున్నట్లు రోహిత్ సరదాగా పేర్కొన్నాడు.
సూర్యకుమార్ యాదవ్ ఎప్పుడూ బ్యాటింగ్ చేయాలనే కసితోనే ఉంటాడని, దాన్ని అతను ఎంతో ఎంజాయ్ చేస్తాడని రోహిత్ వెల్లడించాడు. అందుకే టీ20 వరల్డ్ కప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఈ నెల 23న జరిగే తొలి మ్యాచ్‌లోనే సూర్యను ఆడించాలను అనుకుంటున్నట్లు రోహిత్ నవ్వుతూ చెప్పాడు. ఈ ఆట మొత్తం ఆ మ్యాచ్‌లో వస్తే చాలా బాగుంటుందని రోహిత్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. పిచ్, మ్యాచ్ సిచ్యూవేషన్‌తో సంబంధంలేని ఆట తీరుతో సూర్యకుమార్ అదరగొడుతున్నాడు. మిగతా జట్టు మొత్తం పిచ్ వల్ల ఇబ్బంది పడుతున్నా, వెంటవెంటనే వికెట్లు కోల్పోయినా.. ప్రత్యర్థి బౌలర్లు మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసినా.. ఇవేవి సూర్య బ్యాటింగ్‌పై ప్రభావం చూపడం లేదు. అందుకే టీ20 వరల్డ్‌లో సూర్య నేరుగా వచ్చి అదరగొట్టాలని రోహిత్ భావన.
Rohit Sharma on SKY pic.twitter.com/O3TKJ8Ljlx
— RVCJ Media (@RVCJ_FB) October 3, 2022
How can @surya_14kumar‘s dazzling form be retained? 🤔
🗣️ 🗣️ Here’s what #TeamIndia captain @ImRo45 said. #INDvSA pic.twitter.com/Gkbaej2dHc
— BCCI (@BCCI) October 2, 2022
ఇది కూడా చదవండి: పంత్ బ్యాటింగ్ ఎలాగో లేదు.. కీపింగైనా సరిగా చెయ్!