భారత్ – సౌతాఫ్రికా మధ్య తాజాగా 2వ టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ప్రేక్షకులు సిక్సర్లు, ఫోర్లతో తడిసి ముద్దైయ్యారు. ఇక ఈ మ్యాచ్ లో ఎన్నో ఆసక్తికర, సరదా సన్నివేశాలు జరిగాయి. అందులో ఒకటి మైదానంలోకి పాము రాగా.. మరొకటి పంత్ చేయి జారిన బాల్ రోహిత్ కు తగలరాని చోట తగిలింది. అయితే ఈ రెండు కాకుండా ఈ మ్యాచ్ కు సంబంధించిన మరో వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే? టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్.. సౌతాఫ్రికా ప్లేయర్ ను కాలితో తన్నాడు. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే..
యజ్వేంద్ర చాహల్.. ఎంత అద్భతంగా బౌలింగ్ చేస్తాడో.. అంతే అద్భుతంగా చమత్కారాలు చేస్తాడు. ఆట అనంతరం ఆటగాళ్లను తన వక్చాతుర్యంతో ముప్పు తిప్పలు పెడుతుంటాడు. తికమక ప్రశ్నలు అడుగుతూ నవ్వులు పూయిస్తూంటాడు. అదీ కాక సోషల్ మీడియాలో తన భార్యతో కలిసి చాలా యాక్టీవ్ గా ఉంటాడు. అయితే ఈ క్రమంలోనే తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన 2వ టీ20లో చాహల్.. సౌతాఫ్రికా క్రికెటర్ అయిన తబ్రాజ్ షమ్సీ ని వెనకాల నుంచి వచ్చి సరదాగా కాలితో తన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. విషయంలోకి వస్తే.. సౌతాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న సందర్భంలో.. 2వ ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు దీపక్ చాహర్. మెుదటి బంతి వేయగానే స్టేడియంలో కరెంట్ పోయింది. దాంతో కొద్దిసేపు ఆటను నిలిపివేశారు. అప్పటికి క్రీజ్ లో మార్క్రమ్, డికాక్ లు ఉన్నారు. వారికి డ్రింక్స్ పట్టుకుని తబ్రాజ్ షమ్సీ వచ్చాడు.
అయితే వీళ్లు ముగ్గురు రిషబ్ పంత్ తో కలిసి మాట్లాడుతుండగా.. వెనుక నుంచి మెల్లగా వచ్చిన చాహల్ షమ్సీని మోకాలితో నెమ్మదిగ తన్నాడు. దాంతో వెనక్కి తిరిగిన షమ్సీ.. చాహల్ ను చూడగానే నవ్వులు పూయించాడు. అతడిని కౌగిలించుకుని సరదాగా మాట్లాడుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో నెటిజన్స్ సరదాగా స్పందిస్తున్నారు.”చాహల్ జీ మీరెక్కడున్నా.. నవ్వులే” వెనక నుంచి తన్నావ్ కాబట్ట సరిపోయింది.. అదే ముందు తన్నుంటే?” అంటూ ఫన్నీ గా కామెంట్స్ చేస్తున్నారు. అయితే తబ్రాజ్ షమ్సీ IPLలో రాజస్థాన్ తరపున 5 మ్యాచ్ లు ఆడాడు. అప్పుడు రాజస్థాన్ జట్టులో చాహల్ కూడా ఓ ప్లేయర్ గా ఉన్నాడు. ఇద్దరూ స్పిన్నర్లు కావడంతో.. ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఇప్పుడు అదే స్నేహం కారణంగా సరదాగా తబ్రాజ్ ను ఆట పట్టించాడు చాహల్. షమ్సీ టీ20 బౌలర్స్ ర్యాంకింగ్స్ లో 2వ స్థానంలో ఉండటం విశేషం.
Yuzvendra Chahal Sir 😅 his Character is so down to earth and Funny. @yuzi_chahal Sirpic.twitter.com/Zi7svSo1eb
— Ayush Ranjan (@AyushRaGenius) October 3, 2022