క్రికెట్ అంటే జెంటిల్‌మెన్ గేమ్ అని అందరికీ తెలుసు. అయితే క్రికెట్ మ్యాచ్ అంటే అద్భుతాలకు అడ్డా అని కూడా అందరికీ తెలుసు. ఒక మ్యాచ్‌లో కొన్నిసార్లు ఎన్నో అద్భుతాలు జరగచ్చు. అది ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్, స్కోర్‌లో కావచ్చు. కానీ, జింబాబ్వే టీమ్ కెప్టెన్ ఇప్పుడు బౌలర్లతో ఒక అద్భుతం చేశాడు. నిజానికి క్రికెట్ ప్రపంచంలో అలాంటి అద్భుతం జరగలేదనే చెప్పాలి. ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి శ్రీలంక- జింబాబ్వే మధ్య జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఇలా చేశారు. మ్యాచ్‌లో 33 పరుగులతో శ్రీలంక గెలిచినప్పటికీ అంతా జింబాబ్వే గురించే మాట్లాడుకుంటున్నారు. క్రికెట్ ప్రపంచంలో ఎప్పుడు ఏదైనా జరగచ్చు అంటూ కామెంట్ చేస్తున్నారు.
అసలు ఏం జరిగిందంటే.. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా శ్రీలంక- జింబాబ్వే మధ్య వార్మప్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో జింబాబ్వే కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ ఏకంగా 11 మందితో బాలింగ్ చేయించాడు. ఇప్పుడు అంతా ఈ క్రెయిగ్ ఎర్విన్ చేసిన దాని గురించే మాట్లాడుకుంటున్నారు. జింబాబ్వే 15 మంది వరల్డ్ కప్ జట్టులో కీపర్ చకబావా, కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్, మదాండే, మున్యోంగా మినహా మిగిలిన 11 మంది బౌలింగ్ వేశారు. 9 మంది ప్లేయర్లు రెండేసి ఓవర్లు వేయగా.. ఇద్దరు మాత్రం చెరో ఓవర్ వేశారు. బ్రాడ్ ఈవన్స్, ర్యాన్ బర్ల్, సికందర్ రజా, వెస్లే, మిల్టన్ షుంబాలు తలో వికెట్ పడగొట్టారు. 11 మంది బౌలర్లు కలిసి మొత్తం 188 పరుగులు ఇచ్చారు.
Sri Lanka seal a comprehensive win against Zimbabwe in their first #T20WorldCup warm-up match 🙌#SLvZIM | 📝 Scorecard: https://t.co/fDS3QisoHd pic.twitter.com/1tICs3dQwh
— T20 World Cup (@T20WorldCup) October 11, 2022
Zimbabwe men’s team used 11 bowlers in the Warm-up match today. Nice.https://t.co/5qRhoL1mBC#SLvsZIM #CricketTwitter pic.twitter.com/IrNZlEXsau
— Krithika (@krithika0808) October 11, 2022
Wow :/#SLvsZIM pic.twitter.com/ZsGaUFPbcx
— Penguin P (@PenguinP15) October 11, 2022
Zimbabwe Be Like -: sabko milega sabko milega.#SLvsZIM #WarmUpMatch pic.twitter.com/GvcZlfDBRi
— YASH KHAN SALMAN (@yashkhan2417) October 11, 2022
Coach: How many bowling options would you like to have?
Captain: Yes!#T20WC2022 #SLvZIM #SLvsZIM pic.twitter.com/zxMZV1qazI
— Home of Cricket Memes (@TheCric8Addict) October 11, 2022