‘నిను వీడని నీడను నేనే..’ టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ పాడుతోన్న పాట ఇదే. క్రికెట్ పై మక్కువ లేదంటూనే పంత్ ఆడుతున్న మ్యాచులు ఎక్కడ జరిగినా స్టేడియంలో ప్రత్యక్షమయ్యేది. పోనీ, ఇది స్వదేశీ మ్యాచులతో ఆగిందా! అంటే లేదు.. ఇప్పుడు ఏకంగా ఖండాలు దాటింది. ఆమె దేని కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిందో తెలియదు కానీ.. షేర్ చేసిన పోస్ట్ మాత్రం పంత్ కోసమేననే విషయం అర్థమవుతుంది.’ నా లవ్‌ను అనుసరిస్తున్నాను.. ఆస్ట్రేలియాకు వెళ్తున్నా..’ అని ఫ్లైట్‌లోని ఫొటోను షేర్ చేసింది. దీంతో ఊర్వశీ, పంత్ కోసమే ఆస్ట్రేలియాకు వెళ్లిందని కామెంట్స్ వస్తున్నాయి.
మొన్నటికి మొన్న ఆసియా కప్ మ్యాచ్‌లు చూడటం కోసం దుబాయ్ వెళ్లిన ఊర్వశీ.. తాజాగా టీ20 వరల్డ్ కప్ ముంగిట ఆస్ట్రేలియా వెళ్లింది. అది కూడా టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా ఆటగాళ్లు బయల్దేరి వెళ్లిన రెండు రోజులకే. తాను ఆస్ట్రేలియా వెళ్లే విమానంలో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఊర్వశి.. “నా మనసు మాట విన్నాను. ఆస్ట్రేలియా బయల్దేరాను..” అంటూ క్యాప్షన్ జత చేసింది. పోనీ, ఆస్ట్రేలియా వచ్చాక కామ్ గా ఉంటోందా! లేదు.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోలు షేర్ చేస్తూ పంత్ ను గుర్తు చేస్తోంది. ఇది అతని ఏకాగ్రతను పాడు చేసేలా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Somebody save our Rishabh Pant..😭😭 Hey Bhagwan kaisa julm hai ye..😭😭#UrvashiRautela #Rishabpant pic.twitter.com/rmgfByPvgL
— Avinash Aryan (@AvinashArya09) October 9, 2022
పంత్ తనతో సెక్స్ చేయడానికి తెగ ఆరాటపడ్డాడని ఆరోపణలు చేసిన ఊర్వశీ రౌటేటా.. ఆసియా కప్ ముంగిట సోషల్ మీడియా వేదికగా అతనితో వాగ్వాదానికి దిగింది. అతని పేరును ప్రస్తావించకుండా..’ మిస్టర్ ఆర్పీ నాకోసం పది గంటలపాటు హోటల్ గదిలో వేచి చూసాడు.. నేనేమో షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చి నిద్రపోయాను. మెలకువ వచ్చి చూస్తే 16-17 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఓ వ్యక్తి నాకోసం అన్ని గంటలపాటు నిరీక్షించినా కలవలేకపోవడం బాధనిపించింది. మరోసారి ముంబైలో కలుస్తానని చెప్పాను. అలాగే కలిశాం..’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ విషయంపై పంత్ కలుగజేసుకొని.. ‘పాపులారిటీ కోసం ఇంత దిగుజారుతారా?’ అంటూ కౌంటరిచ్చాడు. దీంతో రెచ్చిపోయిన ఊర్వశీ.. బ్యాట్ బాల్ ఆడుకోవాలని, నకరాలు చేస్తే ఇజ్జత్ తీస్తానని హెచ్చరించింది.
‘అరే ఓ చోటు భయ్యా.. బ్యాట్ బాల్ ఆడుకో. నేను చిన్నపిల్లను కాదు. నీలాంటి పిల్ల బచ్చాల వల్ల బద్నాం అవ్వడానికి.. సైలెంట్‌గా ఉన్నానని అడ్వాంటేజ్ తీసుకోకు. నువ్వో కౌగర్ హంటర్(ఎక్కువ వయసున్న అమ్మాయితో శారీరక సంబంధం కోరుకునేవాడు)..” అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీనికి పంత్ మన ఆధీనంలో లేని విషయాలను ఏ మాత్రం పట్టించుకోవద్దని బదులిస్తూ..” అక్కడితో వదిలేశాడు. కానీ, ఊర్వశీ మాత్రం అతన్ని ఇప్పట్లో వదిలేలా లేదు.