టీమిండియా వర్సెస్ సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతోంది. అందులో భాగంగా ఇప్పటికే ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఇక సిరీస్ నిర్ణయాత్మకమైన చివరి వన్డేలో భారత బౌలర్లు విజృంభించారు. దాంతో సౌతాఫ్రికా బ్యాటర్లు అందరు పేకమేడలా కుప్పకూలారు. టీమిండియా బౌలర్లలో ముఖ్యంగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన మణికట్టుతో మాయచేశాడు. దాంతో 99 పరుగులకే ప్రోటీస్ జట్టు ఆలౌట్ అయ్యింది. దాంతో ఓ చెత్త రికార్డును సైతం తన ఖాతాలో జమచేసుకుంది. దక్షణాఫ్రికా జట్టుకు వన్డేల్లో ఇది నాలుగో అత్యల్ప స్కోరు. ఈ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
టీమిండియా-సౌతాఫ్రికా మధ్య సిరీస్ నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో భారత బౌలర్లు జూలు విదిల్చారు. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ను ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా ఏ దశలోనూ భారత బౌలర్ల ముందు నిలబడలేకపోయింది. దాంతో 27.1 ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలింది. సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ డికాక్.. టీమిండియా బౌలర్లను ఎదుర్కొనడంలో ఇబ్బందికి గురై 6 పరుగులకే వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ మలన్ కొద్దిగా కుదురుకున్నాడు అనుకునే లోపే అతడిని మహ్మద్ సిరాజ్ బోల్తా కొట్టించాడు. మలన్ 27 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసిన పెవిలియన్ చేరాడు. క్రీజ్ లోకి వచ్చిన వారు వచ్చినట్లే.. ఏదో అర్జెంట్ పని ఉన్నట్లుగా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో హెండ్రిక్స్(3), మార్ర్కమ్(9), కెప్టెన్ మిల్లర్(7), ఫెల్యూక్వావో(5), జాన్సన్(14), ఫొర్ట్యూన్(1), నోర్టిజ్(0), ఎంగిడి(0) పరుగులు చేయగా.. మిడిలార్డర్ బ్యాటర్ అయిన క్లాసెన్ ఒక్కడే 42 బంతుల్లో 4 ఫోర్లతో 34 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.
ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికాను కుప్పకూల్చాడంలో స్పిన్నర్లే కీలక పాత్ర పోషించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4.1 ఓవర్లు వేసి ఒక మెయిడెన్ తో సహా 18 పరుగులు మాత్రామే ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. మిగతా బౌలర్లలో దీపక్ చాహర్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ 2 కీలక వికెట్లు తీయగా, సిరాజ్, షహబాజ్ అహ్మద్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. కుల్దీప్ తన మణికట్టు మాయని మరోసారి ప్రపంచానికి చాటాడు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ప్రస్తుతానికి 7 ఓవర్లలో 42/1తో ఆడుతోంది. క్రీజ్ లో శుబ్ మన్ గిల్ 30 పరుగులు, ఇషాన్ కిషన్ (0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ధావన్ 8 పరుగుల వద్ద రనౌట్ గా వెనుదిరిగాడు.
Kuldeep Yadav finishes with a four-fer against South Africa in a series decider.#CricTracker #INDvSA #KuldeepYadav pic.twitter.com/tqUgCOjzoS
— CricTracker (@Cricketracker) October 11, 2022
A total domination from Indian bowlers that helped them to bundle out South Africa for just 99 runs.#INDvSA #MohammedSiraj #KuldeepYadav #CricketTwitter pic.twitter.com/PmFfDVtSYY
— CricTracker (@Cricketracker) October 11, 2022