మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు.. తొలి టీ20లో నెగ్గినా నాగ్‌పూర్, హైదరాబాద్‌లలో మాత్రం పరాజయం పాలై సిరీస్ కోల్పోయింది. ఈ సిరీస్‌లో భారత పేస్ బౌలర్లు దారుణంగా విఫలమైనా ఆసీస్‌ను కట్టడి చేసింది మాత్రం స్పిన్నర్ అక్షర్ పటేల్ ఒక్కడే. మూడు మ్యాచ్‌లలోనూ అక్షర్ తనదైన మార్కు చూపించాడు. అలాగే.. సూర్య కూడా కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. ఎడాపెడా సిక్సులు బాదుతూ ఆసీస్ బౌలర్ల లయ దెబ్బతీశాడు. తాజాగా, భారత జట్టు ప్రదర్శనపై ఆస్ట్రేలియా హెడ్‌కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ప్రశంసలు కురిపించాడు.
భారత బ్యాటర్లకు తగ్గ బౌలింగ్ ఆస్ట్రేలియా జట్టులో లేదు అన్నట్లుగా అభిప్రాయపడ్డాడు. “ఓడిపోయాక ఎప్పుడూ డిస్కసన్స్ జరుగుతూనే ఉంటాయి. డెత్ బౌలింగ్‌లో మా జట్టు మెరుగ్గా ఉందా అంటే నేను దానికి అవుననే సమాధానం చెబుతాను. కానీ, అందుకు తగ్గ నిర్ణయాలు తీసుకోవాలి. వాటిని సక్రమంగా అమలుచేయాలి. కొన్నిసార్లు బ్యాటర్ నైపుణ్యం కూడా బౌలర్ ప్లాన్స్‌ను చెడగొట్టొచ్చు. ఇప్పుడలానే జరిగింది. మేము సిరీస్ అంతటా హార్దిక్ విషయంలో మా ప్లాన్స్ వర్కౌట్ అయ్యేలా చూశాం. కానీ, అదే మాకు దెబ్బకొట్టింది. ఇలా సూర్యకుమార్ యాదవ్ విషయంలో ప్లాన్ చేయాల్సింది”.
An exhibition from Suryakumar Yadav in Hyderabad.
📸: Disney+Hotstar#INDvAUS | @surya_14kumar pic.twitter.com/BVJAuTSrjo
— CricTracker (@Cricketracker) September 25, 2022
“అతని నైపుణ్యానికి బౌలర్లు ఏం చేయగలరు చెప్పండి. అతను కెరీర్ బెస్ట్ స్టేజులో ఉన్నాడు. రాబోవు టీ20 ప్రపంచకప్‌లో అత్యంత డేంజరేస్ ప్లేయర్ అతడే. అతను ఏమి చేయగలడో ఈ మ్యాచ్‌లో చూపించాడు. అన్ని జట్లకు ఇదొక గుణపాఠం’ అని మెక్ డొనాల్డ్ పేర్కొన్నాడు. అలాగే.. అక్సర్ పటేల్ గురుంచి ప్రస్తావిస్తూ.. “ఈ సిరీస్‌లో అక్షర్ అద్భుతంగా రాణించాడు. గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి రవీంద్ర జడేజా తప్పుకోవడంతో టీమిండియా బలహీనపడిపోయిందని అనుకున్నాం. కానీ అక్షర్ మాత్రం జడేజా స్థానాన్ని భర్తీ చేశాడు. అతడి బౌలింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు.. ఒక ఆటగాడు లేడు అనుకుంటే అతడిని భర్తీ చేసే ఆటగాళ్లను టీమిండియా తయారుచేసుకుంది..” అని చెప్పుకొచ్చాడు.
Suryakumar Yadav has won 6 player of the match awards from just 29 innings in T20I. pic.twitter.com/h6kNlln5xj
— Johns. (@CricCrazyJohns) September 25, 2022
ఈ సిరీస్‌లో అక్సర్.. 3 మ్యాచుల్లో 8 వికెట్లు పడగొట్టాడు. మొహాలీలో 4 ఓవర్లు వేసి 17 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా.. వర్షం వల్ల 8 ఓవర్లకు కుదించిన నాగ్‌పూర్ మ్యాచ్‌లో 2 ఓవర్లలో 13 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. హైదరాబాద్‌లో కూడా తన ఫామ్‌ను కొనసాగిస్తూ.. 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కింది. ఇక, ఉప్పల్ మ్యాచులో సూర్య 69 (36 బంతుల్లో) పరుగులతో రాణించినందుకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Australia head coach Andrew McDonald heaps praise on star Indian batter Suryakumar Yadav
📷: ICC/BCCI#INDvAUS #AUSvIND #TeamIndia #IndianCricketTeam #SuryakumarYadav #AndrewMcDonald #CricketNews #CricketTwitter | @surya_14kumar pic.twitter.com/CNf3zliojR
— SportsTiger (@sportstigerapp) September 26, 2022