కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు దూసుకుపోతున్నారు. గాయాలను సైతం లెక్కచేయకుండా పతకాల వేట కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత జూడో ప్లేయర్ సుశీలా దేవీకి త్రుటిలో స్వర్ణం చేజారింది. రక్తం కారుతున్నా లెక్కచెయకుండా గొప్పగా పోరాడింది. మరిని వివరాల్లోకి వెళితే..
రక్తం కారుతున్నా పట్టించుకోలేదు.. లక్ష్యంపైనే తనగురి.. నాలుగు కుట్లు పడ్డాయి.. అయినా బెదరలేదు.. అదరలేదు.. అలాగే ముందుకు సాగింది. చివరికి పోరాడి ఓడిపోయింది. కానీ అందరి మనసులు గెలిచింది జూడో ప్లేయర్ సుశీలా దేవీ. కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా మహిళల 48 కేజీల విభాగంలో బరిలోకి దిగిన సుశీలా దేవీ ఫైనల్లో దక్షిణాఫ్రికా ప్లేయర్ అయిన మైకెలా వైట్ బూ చేతిలో ఓడిపోయింది. గాయం కారణంగా నాలుగు కుట్లు వెయించుకోనే 4.25 నిమిషాలు ఆట కొనసాగించింది.
దాంతో రజత పతకంతో సరిపెట్టుకొవాల్సి వచ్చింది. ప్రధాని మోదీ సైతం అమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ ట్విట్ చేశాడు. అమె దేశానికి గర్వకారణం అని పొగిడాడు.
Congratulations to Sushila Devi on winning the Silver Medal for India at the #CommonwealthGames2022 !!
She missed the Medal at the #Tokyo Olympics but she has strongly come back to bring laurels for the country.
The Nation is proud #SushilaDevi 🇮🇳 pic.twitter.com/6hiJ34r9rO
— Kiren Rijiju (@KirenRijiju) August 1, 2022
ఇక పురుషుల 60 కిలోల జూడో విభాగంలో వారణాసికి చెందిన విజయ్ కుమార్ యాదవ్ కాంస్యన్ని సాధించాడు. ఈ మ్యాచ్ ను అతను కేవలం 58 సెకన్లలోనే ముగించడం విశేషం. మహిళల వెయిట్ లిఫ్టింగ్ 71 కేజీల విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ హర్జిందర్ కౌర్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆమె మెుత్తం 212 కేజీల బరువును ఎత్తింది. దీంతో భారత పతకాల సంఖ్య మెుత్తం 9 కి చేరింది. ప్రస్తుతం భారత్ కామన్వెల్త్ క్రీడల్లో ఆరో స్థానంలో ఉంది. కామన్వెల్త్ క్రీడల్లో భారత పతకాల వేటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
9️⃣th medal for 🇮🇳 at @birminghamcg22 🤩🤩
After high voltage 🤯 drama India’s #HarjinderKaur bags 🥉 in Women’s 71kg Final with a total lift of 212Kg 🏋♂️ at #B2022
Snatch- 93kg
Clean & Jerk- 119kgWith this #TeamIndia🇮🇳 wins its 7️⃣th Medal in 🏋♀️🏋♂️ 💪💪#Cheer4India🇮🇳 pic.twitter.com/D13FqCqKYs
— SAI Media (@Media_SAI) August 1, 2022
Elated by the exceptional performance by Shushila Devi Likmabam. Congratulations to her on winning the Silver medal. She has demonstrated remarkable skill and resilience. Best wishes for her future endeavours. pic.twitter.com/fZ5t49WjKV
— Narendra Modi (@narendramodi) August 1, 2022
ఇదీ చదవండి: టీమిండియా ఓటమికి రోహిత్ చెత్త కెప్టెన్సీనే కారణం! మండిపడుతున్న క్రికెట్ ఫ్యాన్స్
ఇదీ చదవండి: IND vs WI: విండీస్‌తో రెండో టీ20లో టీమిండియా ఓటమి! ఆవేశ్ ఖాన్‌పై ఫ్యాన్స్ ఫైర్