విండీస్ టూర్‌లో టీమిండియా వరస విజయాలకు బ్రేక్ పడింది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి టీ20 సిరీస్‌ను విజయంతో ప్రారంభించిన రోహిత్ సేన రెండో టీ20లో తేలిపోయింది. విచిత్ర కారణాలతో సోమవారం మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌లో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే ప్రధాన కారణమైనా.. చివర్లో రోహిత్ శర్మ చెత్త కెప్టెన్సీ కారణంగానే టీమిండియా ఓడిపోయిందని క్రికెట్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. సీనియర్ బౌలర్ డెత్త్ ఓవర్ల స్పెషలిస్ట్ భువనేశ్వర్ కుమార్‌కు రెండు ఓవర్లు ఉంచుకుని.. హార్దిక్ పాండ్యాకు 18వ ఓవర్, ఆవేశ్ ఖాన్‌కు 20వ ఓవర్ ఇవ్వడంతో రోహిత్ శర్మపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 19.4 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. హార్దిక్ పాండ్యా(31 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 31), రవీంద్ర జడేజా(30 బంతుల్లో ఫోర్‌తో 27) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లంతా విఫలయ్యారు. ఒబెడ్ మెక్కాయ్ 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టి భారత్ పతనాన్ని శాసించాడు. ఈ లెఫ్టార్మ్ పేసర్ ధాటికి భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌కే రోహిత్ శర్మ గోల్డెన్ డక్ అయ్యాడు. సూర్య కుమార్ యాదవ్(11), శ్రేయస్ అయ్యర్(10) కెప్టెన్‌ను అనుసరించారు. రిషభ్ పంత్(24), హార్దిక్ కొంత పోరాడినా హోస్సెన్ దెబ్బతీసాడు. చివర్లో అశ్విన్, కార్తీక్ కూడా విఫలమవడంతో టీమిండియా స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. మెక్కాయ్ 6 వికెట్లతో పాటు హోల్డర్ రెండు వికెట్లు పడగొట్టాడు. హోస్సెన్, జోసఫ్ తలో వికెట్ తీసుకున్నారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 141 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రాండన్ కింగ్(52 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68)హాఫ్ సెంచరీతో రాణించగా.. డేవన్ థామస్(19 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 31 నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. కైల్ మేయర్స్(8), నికోలస్ పూరన్(14), షిమ్రాన్ హెట్‌మైర్(6), రోవ్‌మన్ పొవెల్(5) విఫలమయ్యారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, జడేజా, అశ్విన్, హార్దిక్ పాండ్యా, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ తీశారు. స్వల్ప లక్ష్యమే అయినా మ్యాచ్‌ను భారత్ ఆఖరి ఓవర్ వరకు తీసుకెళ్లింది. చివరి మూడు ఓవర్లలో విండీస్ విజయానికి 27 పరుగులు అవసరమవ్వగా.. 18వ ఓవర్ వేసిన హార్దిక్ 11 పరుగులిచ్చాడు. ఇక 19వ ఓవర్ వేసిన అర్షదీప్.. డేంజరస్ పోవెల్‌ను ఔట్ చేయడంతో పాటు 6 పరుగులు మాత్రమే ఇవ్వడంతో ఆశలు రేకెత్తాయి. చివరి ఓవర్‌ను భువనేశ్వర్ కుమార్ వేస్తాడని అంతా భావించారు. కానీ.. ఆశ్చర్యకరంగా కెప్టెన్ రోహిత్ శర్మ బంతిని ఆవేశ్ ఖాన్ చేతికి ఇచ్చాడు. చివరి ఓవర్‌లో విండీస్ విజయానికి 10 పరుగులు అవసరమవ్వగా.. ఆవేశ్ ఖాన్ తొలి బంతినే నోబాల్‌గా వేశాడు. దాంతో ఫ్రీ హిట్ అవకాశాన్ని అందుకున్న డెవన్ థామస్ భారీ సిక్సర్ బాదాడు. అదే జోరులో మరో బౌండరీ బాది మ్యాచ్‌ను ముగించాడు. చివరి ఓవర్‌తో ఆవేశ్‌ఖాన్ అనుభవంలేమి కొట్టొచ్చినట్టు కనిపించింది. ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు మాత్రమే వేసిన భువీ కేవలం 12 పరుగులే ఇచ్చాడు. చివరి ఓవర్ భువీ వేసి ఉంటే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేదని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి రోహిత్ శర్మ చెత్త కెప్టెన్సీనే కారణమని మండిపడుతున్నారు. కాగా.. భువీని కాదని ఆవేశ్‌ఖాన్‌కు చివరి ఓవర్ ఇవ్వడాన్ని రోహిత్ శర్మ సమర్ధించుకోవడం విశేషం. భువీ డెత్ ఓవర్స్‌లో ఎన్నో సార్లు అద్భుత ప్రదర్శన చేశాడు. కానీ ఆవేశ్ ఖాన్ లాంటి యువ క్రికెటర్లకు కూడా అవకాశం ఇవ్వాలి కదా అని పేర్కొన్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. Rare captaincy goof up by #RohitSharma having #aveshkhan to bowl the last over despite #BhuvaneshwarKumar being there. Could have saved the match. #IndvsWI #WIvsIND #indvwi — Abhishek (@abhishaek) August 1, 2022 Indian Cricket Fans After Watching Rohit Sharma Asking Avesh Khan To Bowl The Crucial Last Over Instead Of Bhuvaneshwar Kumar.#RohitSharma #aveshkhan #WIvIND #WIvsIND #IndvsWI #INDvWIonFanCode #INDvWI pic.twitter.com/1gRMbaTrue — Akshay (@realakshay5) August 1, 2022 Answered: Why did #RohitSharma go with #AveshKhan over Bhuvi in the final over?@BhogleHarsha & @Parthiv9 discuss, on #CricbuzzLive#WIvIND pic.twitter.com/opyWMFu7jd — Cricbuzz (@cricbuzz) August 2, 2022