టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్, ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ ఇండియన్ క్రికెట్‌కు ఎంతో చేశాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా కోహ్లీ సేవలు టీమిండియాను నెక్ట్స్‌లెవెల్‌కు తీసుకెళ్లాయి. అంతంటి ఎనర్జీతో ఉండే మరో ఆటగాడు టీమిండియాలోనే కాదు ప్రపంచ క్రికెట్లోనే లేడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తర్వాత.. అతని వారసుడిగా టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన విరాట్ కోహ్లీ.. టీమిండియాను అద్భుతంగా నడిపించాడు. కెప్టెన్‌గా ఉన్న సమయంలో విరాట్ కోహ్లీ ఇండియన్ క్రికెట్‌ను ఒంటి చేత్తో ఏలాడనే చెప్పాలి. అలాగే 2016 ఏడాదిని ఆటగాడిగా విరాట్ కోహ్లీ నామసంవత్సరంగా చెప్పుకోవచ్చు. కెప్టెన్సీ వదిలేసిన తర్వాత కూడా టీమిండియాకు వెన్నుముకలా ఉన్నాడు కోహ్లీ.
అలాంటి ఆటగాడు మళ్లీ టీమిండియాకు దొరకడం కష్టమే అయినా.. భారత మాజీ క్రికెటర్, టెస్ట్ స్పెషలిస్ట్ వసీం జాఫర్ మాత్రం ఒక యంగ్ క్రికెటర్లో భవిష్యత్తు కోహ్లీని చూశాడు. విరాట్ కోహ్లీ తర్వాత.. టీమిండియాలో అంతటి గొప్ప ఆటగాడు కాగల వాడు అతడే అంటూ పేర్కొన్నాడు. వసీం జాఫర్‌కు భవిష్యత్తు కోహ్లీగా కనిపించిన ఆ యువ క్రికెటర్ మరెవరో కాదు యంగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్. పంజాబ్‌కు చెందిన ఆ కుర్రాడు.. ప్రస్తుతం టెస్టు, వన్డేల్లో టీమిండియా తరఫున ఇరగదీస్తున్నాడు. ఐపీఎల్లో కోల్కత్తా నైట్ రైడర్స్‌కు ఆడి మంచి గుర్తింపు తెచ్చుకున్న గిల్.. జాతీయ జట్టులో స్థానం సంపాదించి.. నిలకడగా రాణిస్తున్నాడు.
తాజా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో నిరాశ పర్చినా.. రెండో ఇన్నింగ్స్‌లో 110 పరుగులు చేసి అదరగొట్టాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా తొలి టెస్ట్‌కు దూరం అవ్వడంతో ఓపెనర్‌గా వచ్చిన అవకాశాన్ని గిల్ సద్వినియోగం చేస్తున్నాడు. రెండో టెస్టుకు రోహిత్ తిరిగి వచ్చినా.. గిల్‌ను ఆడించే పరిస్థితి సృష్టించాడు. ఈ ప్రదర్శన తర్వాత.. గిల్ గురించి మాట్లాడిన జాఫర్.. టీమిండియాలో కోహ్లీ తర్వాత గిల్ అంతటి స్టార్ అవుతాడని, అతనికి మూడు ఫార్మాట్లలో ఆడే సత్తా ఉందని అన్నాడు. రెండో టెస్టుకు రోహిత్ శర్మ తిరిగి వచ్చినా.. గిల్‌ను మిడిల్డార్‌లో ఆడించే అవకాశం ఉందని పేర్కొన్నాడు. పంజాబ్‌కు ఆడుతున్న సమయంలో గిల్ మిడిల్డార్‌లో ఆడిన విషయాన్ని గుర్తుచేశాడు. మరి గిల్‌పై జాఫర్ వ్యాఖ్యలపై మా అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Special feeling to get my maiden 💯 pic.twitter.com/FgN8qtLYba
— Shubman Gill (@ShubmanGill) December 16, 2022