వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ శివనారాయణ్ చంద్రపాల్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ప్రపంచ క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు చంద్రాపాల్. కళ్ల కింద తెల్లటి రంగు పూసుకుని ప్రత్యేకంగా కనిపించే చంద్రపాల్.. బ్యాటింగ్‌కు రాగానే వికెట్లపై ఉండే బెల్స్‌ను తీసుకుని పిచ్‌పై కొట్టే సీన్ అతన్ని అందరిలో స్పెషల్‌గా నిలిపింది. వెస్టిండీస్ తరఫున 164 టెస్టులు, 268 వన్డేలు, 22 టీ20లు ఆడిన చంద్రపాల్ ఎన్నో మ్యాచ్‌ల్లో మరుపురాని ఇన్నింగ్స్‌లు ఆడి.. విండీస్‌కు గొప్ప గొప్ప విజయాలు అందించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ, టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచిన ఘనత చంద్రపాల్ సొంతం. అలాగే టెస్టుల్లో 51.37 సగటుతో బ్యాటింగ్ చేసిన చంద్రపాల్.. వెస్టిండీస్ టెస్టు టీమ్‌కు ముఖచిత్రంగా మారిపోయాడు. అంతర్జాతీయ క్రికెట్లో 20 వేలకు పైగా పరుగులు చేశాడు.
ఇంతటి ఘన చరిత్ర కలిగి చంద్రపాల్‌ను ఆదర్శంగా తీసుకుని అతని కుమారుడు తగెనరైన్ చంద్రపాల్ సైతం క్రికెట్‌నే కెరీర్‌గా మల్చుకున్నాడు. గతంలో కూడా చాలా మంది దిగ్గజాల కుమారులు సైతం అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చి.. అంతగా సక్సెస్ కాలేదు. కానీ.. చంద్రపాల్ కుమారుడు మాత్రం.. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి జాతీయ జట్టు నుంచి పిలుపు అందుకున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కోసం టీ.చంద్రపాల్‌ను విండీస్ బోర్డు ఎంపిక చేసింది. ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్న వెస్టిండీస్ జట్టు.. సిరీస్ ఆరంభానికి ముందు పీఎం ఎలెవన్‌తో నాలుగు రోజుల వామాప్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో టీ.చంద్రపాల్ సెంచరీతో అదరగొట్టాడు.
235 బంతులు ఎదుర్కొన్న చంద్రపాల్ 11 ఫోర్లు, ఒక సిక్స్‌తో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తం 293 బంతులు ఆడిన చంద్రపాల్ 119 పరుగులు చేసి అదరగొట్టాడు. జాతీయ జట్టులోకి వచ్చి… ఆడిన తొలి వామాప్ మ్యాచ్‌లోనే చంద్రపాల్ సెంచరీతో రాణించడం విశేషం. ఇక ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ఈ నెల 30న మొదలవనుంది. అలాగే రెండో టెస్టు డిసెంబర్ 8న ప్రారంభం కానుంది. ఈ రెండు టెస్టుల్లోనూ టీ.చంద్రపాల్ అదరగొట్టాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. తండ్రి చంద్రపాల్‌కు తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుని.. ప్రస్తుతం దారుణ పరిస్థితిల్లో ఉన్న విండీస్ క్రికెట్‌కు పూర్వ వైభవం తీసుకుని రావాలని ఆశిస్తున్నారు. కాగా.. తొలి రెండు వన్డే వరల్డ్ కప్‌లు గెలిచి.. క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన జట్టు ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉందో మనం చూస్తున్నాం. రెండు టీ20 వరల్డ్ కప్ సైతం నెగ్గిన వెస్టిండీస్.. తాజాగా ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో గ్రూప్ స్టేజ్‌లో స్కాట్లాండ్, ఐర్లాండ్ లాంటి పసికూన చేతుల్లో ఓడి ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే.
Tagenarine Chanderpaul has his first century for the West Indies in their tour match against the Prime Minister’s XI 💯
Following in the footsteps of his father 🙌 pic.twitter.com/OghAyg84qG
— ESPNcricinfo (@ESPNcricinfo) November 24, 2022