ఇప్పటికే సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ధావన్.. తాజాగా మరో రంగంలోకి కూడా అడుగు పెడతాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అవును నేను రాజకీయాల్లోకి వస్తాను.. కానీ, అంటూ.. తన పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
భారతదేశంలో సినిమా ఇండస్ట్రీకి, క్రీడా రంగానికి, రాజకీయ రంగానికి మధ్య విడదీయరాని సంబంధం ఉంది. ఒక రంగంలో రాణించిన వారు మరో రంగంలో కూడా తమదైన ముద్ర వేశారు. ఇక మరికొందరు తమ అదృష్టాన్ని వివిధ రంగాల్లో పరీక్షించుకునేందకు రడీగా ఉన్నారు. తాజాగా టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ వచ్చే ఎన్నికల్లో అంటే 2024 సాధారణ ఎన్నికల్లో పోటీ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తా.. కానీ అంటూ పలు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఐపీఎల్ లో పంజాబ్ కింగ్ ఎలెవన్ కు సారథ్యం వహిస్తున్నాడు ధావన్.
శిఖర్ ధావన్.. టీమిండియా స్టార్ ప్లేయర్ గా ఎన్నో విజయాలను భారత్ కు అందించాడు. అయితే గత కొంత కాలంగా కుటుంబ సమస్యలతో సతమతమవుతూ.. ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలోనే టీమిండియాలో చోటును కూడా కోల్పోయాడు. ఇక మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్ 16 కోసం ఎదురుచూస్తున్నాడు ధావన్. ఈ సీజన్ లో పంజాబ్ కు సారథ్యం వహిస్తున్న ధావన్ తిరిగి మునుపటి ఫామ్ ను అందుకుని, వరల్డ్ కప్ 2023 జట్టులో చోటు దక్కించుకోవాలని ఆరటపడుతున్నాడు. ఈ క్రమంలోనే ధావన్ కు సంబంధించిన ఆసక్తికరమైన వార్త నెట్టింట్లో చక్కర్లు కోడుతోంది. నాలుగు రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఓ నేషనల్ ఛానల్ తో ముచ్చటించాడు. ఈ సందర్బంగా భవిష్యత్ లో రాజకీయాల్లోకి వస్తారా? అన్న ప్రశ్నకు బదులిచ్చాడు శిఖర్.
ధావన్ మాట్లాడుతూ..”నేను రాజకీయాల్లోకి రావాలని నా తలరాతలో రాసుంటే.. కచ్చితంగా వస్తాను. ఇక నేను ఏ రంగంలో అడుగుపెట్టినా గానీ, ఆ రంగంలో 100 శాతం కష్టపడి పని చేస్తాను. కష్టపడటం నాకు చిన్నతనం నుంచే అలవడింది. నాకు 11 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి నేను కష్టపడుతూనే ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చాడు ధావన్. ఇక తన ప్లేస్ లో జట్టులోకి వచ్చిన శుభ్ మన్ గిల్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గిల్ టీ20, టెస్ట్ క్రికెట్ ను చాలా బాగా ఆడుతున్నాడు. గిల్ కు మంచి భవిష్యత్ ఉందని ప్రశంసించాడు. అతడికి సెలెక్టర్లు సైతం అవకాశాలు ఇస్తారని ధావన్ చెప్పుకొచ్చాడు. మరి ధావన్ రాజకీయాల్లోకి వస్తాడా? వస్తే రాణిస్తాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Shikhar Dhawan opened up and spoke about the opportunity of joining politics in the near future.#ShikharDhawan #PunjabKings #IPL2023https://t.co/o3051n3y7u
— CricTracker (@Cricketracker) March 27, 2023