పాకిస్థాన్ మాజీ డాషింగ్ బ్యాటర్ షాహిద్ అఫ్రిదీకి కీలక పదవి కట్టబెట్టింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. ఇంగ్లండ్ చేతిలో మూడు టెస్టుల సిరీస్‌లో వైట్‌వాష్ తర్వాత.. పాకిస్థాన్ ప్రభుత్వం బోర్డులో ప్రక్షాళనకు దిగింది. తొలుత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజాను ఆ పదవి నుంచి తొలగించిన పాక్ గవర్నమెంట్.. అతని స్థానంలో నజమ్ సేథిని ఛైర్మన్‌గా నియమించింది. కొత్తగా నియమితమైన కమిటీ.. తొలుత మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీకి చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించింది. మధ్యంతర సెలెక్టన్ కమిటీకి అఫ్రిదీని చైర్మన్‌గా నియమించారు. ఈ కమిటీ త్వరలో స్వదేశంలో న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్ కోసం జట్టును ఎంపిక చేయనున్నారు. అయితే.. సిరీస్‌కు చాలా తక్కువ టైమ్ ఉన్నా.. అఫ్రిదీ మంచి టీమ్‌ను సెలెక్ట్ చేస్తారనే నమ్మకం ఉన్నట్లు పాక్ బోర్డు ఛైర్మన్ నజమ్ తెలిపారు.
అయితే.. ఆస్ట్రేలియాతో మూడు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు టెస్టులను డ్రా చేసుకున్న పాకిస్థాన్.. చివరి టెస్టులో మాత్రం దారుణంగా ఓడింది. ఆ తర్వాత.. ఇంగ్లండ్‌తో స్వదేశంలోనే జరిగిన 7 టీ20ల సిరీస్‌ను సైతం 3-4తో ఓడింది. అలాగే ఆసియా కప్ 2022 ఫైనల్లో శ్రీలంక చేతిలో భంగపడ్డ పాకిస్థాన్.. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022 ఫైనల్లో సైతం ఇంగ్లండ్ చేతిలో ఓడింది. ఇక వరల్డ్ ఓటమిలో ఉన్న పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్ ఆడేందుకు దాదాపు 17 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్.. బజ్‌బాల్ క్రికెట్‌తో పాకిస్థాన్‌ను వణికించింది. వరుసగా మూడు టెస్టుల్లో ఓడించి… పాక్ పరువు తీసేసింది. దీంతో పాకిస్థాన్ క్రికెట్‌లో ప్రక్షాళన మొదలైంది. పాక్ టీమ్‌పై విమర్శల వర్షం కురవడంతో పాటు.. బోర్డు పెద్దల చెత్త సెలెక‌్షన్‌తోనే ఈ పరిస్థితి తలెత్తిందనే ఆరోపణలు రావడంతో.. బోర్డు చైర్మన్‌ను మార్చిన పాక్.. ఇప్పుడు అఫ్రిదీని సెలెక‌్షన్ కమిటీ చైర్మన్ చేసింది.
చీఫ్ సెలెక్టర్‌గా పగ్గాలు అందుకున్న వెంటనే అఫ్రిదీ.. పాకిస్థాన్ జట్టులో భారీ మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అవసరం అయితే.. బాబర్ అజమ్‌ను కెప్టెన్‌గా తొలగించే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆటగాడిగా అద్భుత రికార్డులు కలిగిన బాబర్ అజమ్ కెప్టెన్‌గా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. పైగా కెప్టెన్సీ భారం అతని ఆటపై కూడా ప్రభావం చూపుతోందనే విమర్శలు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాబర్ అజమ్‌ను వైట్ బాల్ కెప్టెన్‌గా చేసి… టెస్టు టీమ్‌కు వేరే కెప్టెన్‌ను నియమించే ఆలోచనలో సైతం పాక్ బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. మరి కొత్తగా బాధ్యతలు చేపట్టే అఫ్రిదీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో చూడాలి. అయితే.. అఫ్రిదీతో పాటు.. సెలెక‌్షన్ ప్యానెల్‌లో మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్, రావు ఇఫ్తికర్ ఉన్నారు. హరూన్ రషీద్ కన్వినర్‌గా వ్యవహరించనున్నాడు.
— Pakistan Cricket (@TheRealPCB) December 24, 2022
PCB Management Committee has appointed former Pakistan captain Shahid Afridi as the interim Chair of the Men’s National Selection Committee. Other members of the panel are: Abdul Razzaq and Rao Iftikhar Anjum. Haroon Rashid will be the Convener.
— Pakistan Cricket (@TheRealPCB) December 24, 2022