ఆసియా కప్‌లో విఫలం అయిన ఆటగాళ్లనే తీసుకున్నారు. సంజు శాంసన్‌ను మాత్రం పక్కనపెట్టారు. అసలు ఇదేం టీమ్ సెలెక్షన్. సంజుకు అన్యాయం జరుగుతోంది అంటూ టీ20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించిన తర్వాత సర్వత్రా వినిపించిన మాటలు, విమర్శలు. ఇప్పటికీ సోషల్ మీడియాలో సంజు శాంసన్‌ను టీ20 వరల్డ్ కప్ టీమ్‌లోకి తీసుకోకపోవడంపై కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సెప్టెంబర్ 28న తిరువనంతపురంలో టీమిండియా-సౌతాఫ్రికా మధ్య జరగబోయే టీ20 మ్యాచ్ సందర్భంగా నిరసన కార్యక్రమాలు సైతం నిర్వహించేందుకు సంజు ఫ్యాన్స్ ప్రణాళికలు రచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సంజు శాంసన్ స్పందించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టీ20 వరల్డ్ కప్ 2022 కోసం ఎంపిక చేసిన టీమిండియాలో తన పేరు లేకపోవడంపై చాలా మంది సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. కేఎల్ రాహుల్ ప్లేస్‌లో నన్ను తీసుకోవాల్సిందని, రిషభ్ పంత్ ప్లేస్‌లో తీసుకోవాల్సిందని అంటున్నారు. వాళ్లిద్దరూ టీమిండియా కోసం ఆడుతున్నారు. జట్టులో స్థానం కోసం నేను వారితో పోటీకి దిగితే.. నేను నా దేశాన్ని కింది లాగినట్లు అవుతుందని సంజు ఎంతో హుందాగా స్పందించాడు. ప్రస్తుతం సంజు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జట్టులో స్థానం దక్కలేదనే కోపం, తనకు లభిస్తున్న మద్దతుతో సంజు ఆవేశంగా అడ్డగోలు వ్యాఖ్యలు చేయకుండా ఎంతో హుందాగా మాట్లాడాడని అతనిపై ప్రశంసల వర్షం కురుస్తుంది.
కాగా.. సంజు శాంసన్‌ను టీ20 వరల్డ్ కప్ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ జట్టు ఎంపికకు ముందు నుంచే ఉంది. అందుకు కారణం ఈ ఎంపికకు ముందు సంజు మంచి ఫామ్‌లో ఉన్నాడు. కానీ.. సెలెక్టర్లు సంజును కాదని ఆసియా కప్ 2022 కోసం ఎంపిక చేసిన టీమ్‌తోనే టీ20 వరల్డ్ కప్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కాగా.. న్యూజిలాండ్-ఏ, టీమిండియా-ఏ మధ్య జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం సంజు శాంసన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. మరి సంజు శాంసన్‌ను టీ20 వరల్డ్ కప్‌కు ఎంపిక చేయకపోవడంపై, అలాగే సంజు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Sanju Samson said, “there’s alot of talks going on social that Sanju Samson should replace KL Rahul, Sanju should replace Rishabh Pant. My thinking is very clear, both KL and Pant plays for my own team, if I compete with my own teammates then I’m letting my country down”.
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 17, 2022
ఇది కూడా చదవండి: వెంకటేశ్ అయ్యర్‌ను బౌలర్ ఎందుకు కొట్టాడు? ఇప్పుడు అయ్యర్ పరిస్థితి ఎలా ఉందంటే?