టీమిండియా యువ క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ బ్యాటింగ్ చేస్తూ బాల్ తగిలి క్రీజ్‌లోనే కుప్పకూలిన వార్త క్రీడా వర్గాల్లో సంచలనం సృష్టించింది. దులీప్ ట్రోఫీలో భాగంగా సెంట్రల్ జోన్, వెస్ట్‌జోన్ మధ్య జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సెంట్రల్ జోన్‌కు ఆడుతున్న వెంకటేశ్ అయ్యర్‌ను వెస్ట్‌జోన్ ప్లేయర్ చింతన్ గజా బాల్‌తో కొడితే తలకు బలమైన గాయమైనట్లు వార్తలు వచ్చాయి. మైదానంలోకి ఏకంగా అంబులెన్స్ వచ్చిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. కాగా.. అసలు మ్యాచ్ మధ్య ఇద్దరి ఆటగాళ్ల మధ్య ఏం జరిగింది? ఇప్పుడు అయ్యర్ పరిస్థితి ఎలా ఉందనే విషయాలు తెలుస్తున్నాయి.
కోయంబత్తూర్ వేదికగా సెంట్రల్ జోన్-వెస్ట్‌జోన్ మధ్య మ్యాచ్‌లో సెంట్రల్‌జోన్ బ్యాటింగ్ సందర్భంగా వెంకటేశ్ అయ్యర్ బ్యాటింగ్‌కు వచ్చాడు. వెస్ట్ జోన్ బౌలర్ చింతన్ గజా బౌలింగ్‌లో అయ్యర్ భారీ సిక్స్ కొట్టాడు. అయ్యర్ కొట్టిన సిక్స్ చింతన్ గజాకు కోపం తెప్పించింది. బ్యాటర్ సిక్స్ కొట్టినప్పుడు బౌలర్ ఆవేశానికి గురికావడం సహజం. కానీ.. గజా తన ఆవేశాన్ని మరింత తీవ్రంగా ప్రదర్శించాడు. తర్వాతి బంతిని అయ్యర్ డిఫెన్స్ ఆడగా అది కాస్త బౌలర్ చింతన్ చేతుల్లోకే వెళ్లింది. అయ్యర్ పరుగు కోసం ప్రయత్నించకపోయినా.. గజా బంతిని వేగంగా వికెట్ కీపర్‌కు విసిరేందుకు ప్రయత్నిస్తాడు. అది కాస్తా.. అయ్యర్ మెడకు బలంగా తగులుతుంది. దీంతో అయ్యర్ అక్కడికక్కడే నొప్పితో కుప్పకూలిపోతాడు. హడలిపోయిన స్టాఫ్ వెంటనే అంబులెన్స్‌ను మైదానంలోకి తీసుకురావడంతో అయ్యర్ పరిస్థితి తీవ్రంగా ఉందేమోనని ఆటగాళ్లు సైతం వణికిపోయారు.
కొంతసేపటికి తేరుకున్న అయ్యర్‌ను ఫినియో డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లాడు. ఆ తర్వాత నొప్పిని భరిస్తూనే.. అయ్యర్ మళ్లీ బ్యాటింగ్ చేసేందుకు క్రీజ్‌లోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ.. అయ్యర్ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలువలేకపోయాడు. కేవలం 14 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయ్యర్ ఆడిన చిన్న ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ ఉండటం విశేషం. ఈ ఘటనలో బౌలర్ తప్పిందం ఉన్నట్లు సమాచారం. కానీ.. అతను ఆవేశంలో చేసిన తప్పు అయ్యర్ జీవితానికి భారీ ముప్పుగా మారేంది. అదృష్టవశాత్తు అయ్యర్‌కు తీవ్ర గాయం కాలేదు. ఇప్పుడు అయ్యర్ కోలుకున్నట్లు సమాచారం. కాగా.. ఈ ఘటనపై బీసీసీఐ విచారణ జరిపి, చర్చలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Venkatesh Iyer is back on the field but what Gaja did is unacceptable.
📸: @peri_periasamy pic.twitter.com/oLTR0Y0aml
— KnightRidersXtra (@knightridersxtr) September 16, 2022
Venkatesh Iyer stepped out and hit Chintan Gaja for a six. He then defended the next ball. This sore loser Gaja took the ball and threw at Venkatesh, injuring him.#DuleepTrophy pic.twitter.com/RRzj0ZGSDy
— KnightRidersXtra (@knightridersxtr) September 16, 2022
Unpleasant scene here. Venkatesh Iyer has been hit on the shoulder as Gaja throws the ball defended ball back at the batter. Venkatesh is down on the ground in pain and the ambulance arrives. #DuleepTrophy pic.twitter.com/TCvWbdgXFp
— Dhruva Prasad (@DhruvaPrasad9) September 16, 2022
ఇది కూడా చదవండి: లెజెండ్స్ లీగ్: నో బాల్ కాదు, బైస్ కాదు.. కానీ ప్రత్యర్థికి 5 రన్స్ ఇచ్చిన అంపైర్!